The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘12 step ప్రోగ్రాం’

నేరస్థుల్లో మార్పు కోసం రిహాబిలిటేషన్ సెంటర్

మా బృందం అంతా 10వ తేదీ ఉదయం 9గంటలకు బయలుదేరి skydsvarnet లో ఉన్న పురుషుల డ్రగ్ ఎడిక్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లాం. మా బృందంలో మా ముగ్గురి తో పాటు అంటే నేను, సుందర్, లవణం గారితో పాటు రత్న, ఇవా మరియా, అన్నేల్లి, యుహ కూడా వచ్చారు. ఇవా మరియా అక్కడి కాలేజిలో సోషల్ సైన్సెస్ అధ్యాపకురాలు ఉన్నారు.

బ్యోర్క (bjorka ) ఒక స్వచ్చంద సేవా సంస్థ. 1910 లో ప్రారంభమైంది. ఆ సంస్థ డ్రగ్ ఎడిక్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతోంది. ఆ ఇన్స్తిస్టిట్యూట్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నేరాలు చేసి జైలు జీవితం అనుభవించి ఆ వ్యసనం నుండి బయటకు రావాలనుకునే వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. జైళ్ళలో ఉండేవారి హక్కుల కోసం కూడా పనిచేస్తుంది ఈ సంస్థ.

ఆ ఇన్సి స్టిట్యూట్ లోని శిక్షకుడు Mr. హెన్రిక్ అక్కడి ట్రీట్ మెంట్ ప్రోగ్రాం వివరాలు చెప్పారు. మత్తు పదార్ధాలు, మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటికి తీసుకొచ్చి సభ్య సమాజంలో వారి కుటుంబంలో కలసి పోవడానికి వారు ఉపయోగిస్తున్న 12 step ప్రోగ్రాం గురించి తెలిపారు. మాములుగా ఈ చికిత్సా విధానం మూడు నెలల వ్యవధిలో ఉంటుంది . నేరస్త జీవితం గడిపిన వారిని చిన్న చిన్న గ్రూపులు గా విభజించారు. ఒక్కో గ్రూపులో 15 మంది లోపు ఉండే విధంగా చూస్తారు. వారికి ప్రతి రోజూ ఒక గంట సేపు కౌన్సిలింగ్, చికిత్సలు ఉంటాయి . తర్వాత ఎవరికి వారికి వ్యక్తిగత చికిత్సలు ఉన్నాయి . అవి ఆయా వ్యక్తుల నేరస్థ జీవితం, నేరస్థ ఆలోచనలు మొదలైన వాటిని బట్టి ఉన్నాయి. వ్యక్తిగత చికిత్సలు ఒక వారం పాటు కొనసాగుతాయి. భవిష్యత్ లో వారి ఆలోచనలు నేరాల వైపు మళ్ళకుండా చేయడం చిన్న విషయం సామాన్య విషయం కాదు. ఆ ప్రయత్నం ఈ సంస్థ చేస్తోంది. ఈ సంస్థలో చికిత్స తీసుకొనే ప్రతి ఒక్కరూ మూడు ప్రాథమిక రూల్స్ పాటించి తీరాలి.

అవి:
1. మాదక ద్రవ్యాలు వాడకూడదు
2. నేరాలు చేయకూడదు
3. హింసని ప్రోత్సహించ కూడదు. భయపెట్టకూడదు

అవసరాన్ని బట్టి కొందరికి ఆరు నుండి తొమ్మిది నెలల పాటు చికిత్స ఇస్తామని Mr. హెన్రిక్ చెప్పారు. మేం వెళ్ళినప్పుడు 23 మంది ఉన్నారు. ఆ సెంటర్ లో 23 మందికి ఉండడానికి సదుపాయాలు ఉన్నాయి. నెలలో ఒక రోజు వారిని తమ కుటుంబ సభ్యులు వస్తే కలిసి మాట్లాడడానికి అనుమతిస్తారు. వీళ్ళకు సమూహ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ఈ చికిత్సా విధానంలో కొన్ని కార్యక్రమాలు రూపొందించారు. స్టాక్ హొమ్ నగరంలోని వివిధ ప్రాంతాలకు సభలు , సమావేశాలలో పాల్గొనడానికి వారంలో ఒక సారైనా తీసుకెల్తారు. ఇక్కడికి వచ్చేవారంతా నేర చరిత్రతో జైలు జీవితం నుండి వచ్చిన వారని ముందే చెప్పాను కదా. బయటకు వెళ్ళినప్పుడు పాత జీవితంలోకి వెళ్ళాలని అనిపించవచ్చు. మాదకద్రవ్యాల కోసం ఒక్కోసారి ఎంతకైనా తెగించవచ్చు. అందుకే ఎలాంటి అవాంచనియ సంఘటనలు జరగకుండా సంస్థ ఉద్యోగులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

స్టాక్ హొమ్ నగరంలో చాల డి-అడికషన్ సెంటర్లు ఉన్నాయి. బ్యోర్క సెంటర్లో డి-అడిక్షన్ కార్యక్రమాలు 1968లో ప్రారంభం అయ్యాయి. 2000 సంవత్సరం నుండి 12 స్టెప్ ప్రోగ్రాం ప్రారంభం అయింది. ఇది అమెరికన్ ప్రోగ్రాం అని హెన్రిక్ చెప్పారు.

ఒకప్పుడు స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఇక్కడే చికిత్సలు జరిగేవని అన్నేల్లి చెప్పింది. తాను కూడా ఈ సెంటర్ లోనే చికిత్స తీసుకున్నట్లు తెలిపింది . జైల్లో మంచి నడవడితో ఉండి, కష్టపడి పని చేస్తున్న వారికి శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వస్తే మళ్లీ మాదకద్రవ్యాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువ . ఆ జీవితం వద్దు అనుకునే వారు చికిత్స కోసం జైల్లో ఉన్నప్పుడే జైలు ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.

పిల్లలు, మహిళల కోసం ప్రత్యేకంగా డి -అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి. మహిళల కోసం 2004 లో ప్రారంభమయింది.

నేరాలు చేసేవారిలో ఎక్కువమంది పేదలు. కొద్ది మంది బాగా ఉన్న కుటుంబాల వారు కూడా నేరస్తులుగా ఉన్నారు. స్వీడన్ లో నేరస్తులు అంటే వారు మత్తు పదార్ధాలకో, మాదక ద్రవ్యాలకో అలవాటు పడి వాటి కోసం దొంగతనాలు చేయడం, దోపిడిలు చేయడం , హింసకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. జైలు జీవితం అనుభవించి బయటకి వచ్చాక వారిపై పడిన ముద్ర వారికి పని ఇవ్వదు. చాలా సమస్యలలోకి నెట్టివేస్తుంది. అవి భరించలేక మళ్లీ ఆ నేరస్థ జీవితంలోకి నేట్టివేయబడుతున్నారు. అలాంటి వారికి KRIS జీవితం పట్ల ఆశను పెంచుతూ జైల్ కి వెళ్లి ఖైదీలకు క్లాసులు తీసుకుంటుంది. 3 నెలల పాటు కారాగారం జీతం ఇస్తుంది. స్వీడిష్ సాంఘిక సంక్షేమ శాఖ క్లాసులు ఇస్తుంది. చికిత్స తీసుకునే వారిలో ఎక్కువ మంది 20 నుండి 40 ఎల్లా మధ్య వయస్కులే. వారి జీవితం మీద వారికి బాధ్యత రావడం కోసం వారి దృష్టి మళ్ళిస్తూ వారి వారి ఇష్టాలను బట్టి రకరకాల కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చారు. చదువు, ఆటలు, వినోదం మొదలైనవి.

చికిత్స పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిన వారిలో దాదాపు 30 శాతం మంది తిరిగి వస్తున్నారని, అందుకు కారణం కుటుంబం వారిని అంగీకరించక పోవడమేనన్నాడు హెన్రిక్. కుటుంబం వారిని అంగీకరించడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. ప్రభుత్వం వారికి సగం జీతం ఇస్తుంది .

నేరస్థ జీవిత చరిత్ర కలిగిన వారికి , శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత పాస్ పోర్ట్, వీసా ప్రపంచంలో ఏ దేశం లోనూ ఇవ్వరు. కానీ స్వీడన్ లో కొంత కాలం పరీక్షించిన తర్వాత పరిశీలించిన తర్వాత పాస్ పోర్ట్ , వీసా ఇవ్వొచ్చు అంటాయి స్వీడిష్ చట్టాలు. ఇలాంటి వారికి పాస్ పోర్ట్ / వీసా ఇవ్వాలన్నా, ఉద్యోగం ఇవ్వాలన్నా ప్రజాభిప్రాయం సేకరిస్తారు. అదే విధంగా మీడియా అభిప్రాయం తీసుకుంటారు.

మాజీ నేరస్థులు లేదా సంస్కరించ బడిన నేరస్థుల రక్షణ కోసం, వారిలో మార్పు కోసం ప్రత్యెక పథకాలను అమలు పరుస్తోంది అక్కడి ప్రభుత్వం . మల్టి మీడియా టీచింగ్ ఎయిడ్స్ ఉన్నాయి

దాదాపు స్వీడిష్ వి ధానంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడే వారితో ఎలా డీల్ చేస్తుందో తెలుసుకున్నాం. పూర్తి ఎయిర్ కండిషన్ ఉన్న భవనాలలో వార్తా [పత్రికలు, టెలివిజన్ , ఇంటర్నెట్ అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ అక్కడ.

అదే రోజు మధ్యాహ్నం స్తేన్బిగిర్డ్ లో ఉన్న మహిళల రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్లాం. అది ఎక్కడో పొలాల్లో కొండల దగ్గర ఉన్నట్లుగా ఉంది. చలిగాలులు వీస్తూ .. . ఈ సెంటర్ 2004 లో ప్రారంభమయింది.

అక్కడున్న మహిళల్ని కలిశాం . ఇండియా నుండి వచ్చామని చెప్పగానే కెరిన్ పియా అనే ఒకావిడ వచ్చి తనను తాను పరిచయం చేసుకుంది. తను 1983లో ఎయిర్ హోస్టెస్ గా ఇండియా వచ్చానని యోగ, మెడిటేషన్ నేర్చుకోవాలనుకున్నని చెప్పింది. కానీ , డిల్లీలో డ్రగ్స్ కోసం తన పాస్పోర్ట్ అమ్మేసుకున్నానని , ఆరునెలల తర్వాత ప్రభుత్వ జోక్యం చేసుకోవడం వల్ల తిరిగి తమ దేశం చేరుకున్నానని అంది. ఆ తర్వాత క్లబ్ డాన్సర్ గా పని చెసను. మూడు సంవత్సరాలు సోకాల్ వర్క్ చదువుకున్నని, చైనా నుండి ఆక్యుపంచర్ నేరుచుకున్నని తెలిపింది బెట్రిస్ గోవాబీచ్ లలో సన్ బాత్ చాలా ఇష్టపడే దాన్నని, అక్కడ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డానని, రెండుసార్లు జైలు జీవితం అనుభవించి మారాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్లో చేరానని చెప్పింది. మరోకావిడ రెండేళ్ళ క్రితం ఇండియా వచ్చి ఆగ్రా , డిల్లీ, జైపూర్ చూశానని చెప్పింది. అక్కడ ఉన్న వారి నేరాలు అన్నీ డ్రగ్స్ అమ్ముతునో, డ్రగ్స్ కోసం దొంగ తనం చేసో, డ్రగ్స్ కోసం హింసకు పాల్పడం వాళ్ళ జరిగినవే. ముగ్గురు కౌన్సిలర్లు , ఇద్దరు సోషల్ వర్కర్లు ఉన్నారు. పాతిక మంది మహిళలు ఉన్నారక్కడ. అంతా మాదక ద్రవ్యాల మత్తు నుండి బయట పడాలని అనుకుంటున్నామని చెప్పారు. మేం జైలులో ఉన్నప్పుడు KRIS కార్యకర్తలు పదే పదే మా దగ్గరకు వచ్చి ఆ అలవాటునుండి బయట పది సాధారణ జీవితం, గౌరవ ప్రదమైన జీవితం కుటుంబంతో కలసి జీవించడం గురించి చెప్పేవారనీ, మేం మా అలవాటును మానుకోవాలని బలంగా కోరుకుంటే చికిత్స చేయించుకోవడానికి డి -అడిక్షన్ సెంటర్లు స్టాక్ హొమ్ లో చాలా ఉన్నాయని మాకు నచ్చ చెప్పారు. అందుకే మేం ఈ సెంటర్ లో చేరామని చెప్పారు.

వాళ్ళతో మా మాటలు సాగుతుండగా ఒకరు అందరికి టీ సర్వ్ చేసారు. నాకు టీ అలవాటు లేదు. అందుకే వద్దన్నాను. ఇది మేం ఇండియా నుండి తెప్పించుకున్న జై పుర్ టీ అన్నారు . ఆ టీ ప్యాకెట్ కుడా తీసుకొచ్చి చూపారు. దాని మీద పాక్ డ్ ఇన్ లండన్ అని ఉంది. నిజానికి జైపూర్ లో టీ తోటలు లేవు. కానీ, జైపూర్ అంటే విదేసియులకు ఉన్న మోజును మార్కెట్ చేసుకుంటున్నారు తయారీదారులు అనిపించింది.

మరో రోజు యల్విస్ లోని మరో సెంటర్ కి వెళ్ళాం. 55 మందికి చోటు ఉందక్కడ. అక్కడ కూడా 12 స్టెప్ ప్రోగగ్రాం అమలు చేస్తున్నారు. మాజీ నేరస్తులకి మానసిక చికిత్స చేయడం , గ్రూప్ చర్చలు, వ్యక్తి గతంగా అనుకూల, ప్రతికూల అంశాలను ఆ వ్యక్తితో చెప్పించడం వంటివి చేస్తూ మత్తు పదార్ధాలు, మాదకద్రవ్యాలకు దూరం చేయడానికి ప్రయత్నం జరుగుతోందక్కడ.

వారి వసతులు స్టార్ హోటల్ని తలపిస్తూ . కొందరి దగ్గర లాప్ టాప్ లు కుడా ఉన్నాయ్. ప్రతి రూం లో టెలివిజన్ ఉంది. చక్కటి బెడ్ పరుపు, దిండు దుప్పట్లతో ఎంతో అధునాతనంగా ఉన్నాయి వసతులు.

Tag Cloud

%d bloggers like this: