The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘శక్తి’

నెల్లిమర్ల మహిళ

ఆమె
అక్షర జ్ఞానం లేని అతివ
ఆమె
అభం శుభం ఎరుగని అబల
అది నిన్నటి మాట
మరి నేడు ..?
ఆమె
అక్షర జ్ఞానంతో
అనంత శక్తి నింపుకున్న ఆదిశక్తి
అనంత విశ్వంలో
అడ్డంకులు , అగాధాలు , అధిగమించిన ధీశాలి
అవును
బతుకు సమస్యలు తెలిసినది
బతుకు పోరులో రాటు దేలినది
బాంచను గాళ్ళం కాదంటూ
బందులు, ధర్నాలు , రాస్తారోకోలు
అన్నింటా ముందు నిలిచింది
అక్కడి కార్మిక ఉద్యమానికి ఉపిరిగా మారింది

అస్తిపంజరాల్లాంటి అయినవారి
ఆకలికేకలు
ఆమె అణగారిన గుండె లోయల్లో
అంతర్జ్వాల రగిల్చింది
ఓ చంకన చంటోడు
మరో చంకన చద్దిమూటతో
చైతన్యంతో నడిచింది

సంపదకాజేసే సిలీంద్రపు చీడపురుగుల
సరసన చేరిన సర్కారు విధానాలకు
వ్యతిరేకంగా నినదించింది
ఛలో కలేక్టరేట్ అంది
ఎర్రటి ఎండలో
ఎర్ర టోపిల లాటీ దెబ్బలు తింది
కరడుగట్టిన కసాయి కాకీల
కాల్పుల్లో అయిన వారిని కోల్పోయింది

అయనా
పట్టుదలకు , పోరాటానికి
ప్రతీకగా నిలిచింది
పట్టుసడలని విశ్వాసంతో సమరశంఖం ఊదింది
ముందు తరాల వారికి
మార్గదర్శి అయింది
ఆ సమర కాంత
నెల్లిమర్ల మహిళ

వి. శాంతిప్రబోధ
(నెల్లిమర్ల మహిళపై ఎప్పుడో రాసిన కవిత)

Tag Cloud

%d bloggers like this: