The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘వ్యవసాయం’

వ్యవసాయ గురూ ..

ఆశ్చర్యం .. చాలా ఆశ్చర్యం

ఒక్కసారిగా దృశ్యం మారిపోయింది .  నూట ఎనభై మైళ్ళ ప్రయాణంలో దాదాపు ఒకే విధమైన వాతావరణం, పెద్దగా మార్పు లేని దృశ్యాలూ చూసి విసుగొచ్చి వెనక్కి మరలుదాం అనుకొంటుండగా  ఏదో అద్భుతం జరిగినట్లు ప్రకృతి దృశ్యం మారిపోయి . అప్పటివరకూ చూసిన దానికి భిన్నంగా ..  వారి కళ్ళకు, శరీరానికి , మనస్సుకు ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ .. పచ్చదనం సింగారించుకున్న ప్రకృతి

‘ ఎమేజింగ్ వరుణ్ ..  ఎంతలో ఎంత వ్యత్యాసం .. ‘ ఆశ్చర్యంగా అంది క్రాంతి కళ్ళు విప్పార్చుకుని చూస్తూ
‘య్యా .. రియల్లీ .. , అన్ బిలీవబుల్ ‘  కారు నడక వేగం తగ్గింది. కారు ఏసీ ఆఫ్ చేసి విండో డోర్స్ తెరిచారు.
‘స్వచ్చమైన చల్లని పైర గాలి తగులుతుంటే భారమైన మనసుకు ఎంతో హాయిగా ఉంది కద వరుణ్ ‘ ఆ గాలిని ఆస్వాదిస్తున్న క్రాంతి
‘అవును ‘, అంటూ కారు ఆపాడు .
‘ఏంటి వరుణ్ ఇక్కడ ఆపావు ‘
‘అటు చూడు డియర్ .. ఆ పంపు ఎంత నిండుగా నీళ్ళు చిమ్ముతోందో .. పద కొంచెం సేపు ఆ గట్టున ఉన్న చెట్ల కింద కూర్చో వచ్చేమో చూద్దాం ‘ అన్నాడు వరుణ్
‘ఓ గ్రేట్ ఐడియా, కానీ .. వాళ్ళు ఏమంటారో ‘ దూరంగా పొలంలో పని చేసుకుంటున్న వారిని చూసి సందేహం వెలిబుస్తూ కారు దిగింది క్రాంతి . కారు ఓ పక్కకి లాక్ చేసి వచ్చాడు వరుణ్.
పొలం చుట్టూ ఉన్నగోరింటాకు  పెన్సింగ్ దాటుతూ ‘ ఏయ్ వరుణ్, ఇటు చూడు .. ఇది గోరింటాకు ‘ అంది రెండు ఆకులు కోసి పరీక్షగా చూస్తూ .
‘ ఓ అవునా .. కానీ.,  ఏ మొక్క మీద చెయ్యి వేయకు ‘ సలహా ఇచ్చాడు వరుణ్ .
ఇద్దరూ పచ్చని పొలం గట్ల మీద జాగ్రత్తగా నడుస్తున్నారు. బారులు తీరిన బంతి , చేమంతి పూల తోటలు, వాటిపై తిరుగాడే తుమ్మెదలూ..  పూలు కోయడంలో నిమగ్నమైన మహిళలు వీళ్ళ కేసి చూసి తమ పనిలో.  ఒకరు మడిలో కరివేపాకు కొమ్మలు కత్తిరిస్తూ .. మట్టి పరిమళాలకు తోడైన కరివేపాకు సువాసనలతో కలసి వారి గొంతులోంచి జాలువారుతున్న జానపద గీతం అలుపూ సొలుపూ తెలియకుండా
శ్రీరాంపురమే కూతుర కూతుర / చీపురుకట్టే కూతుర కూతుర
ఏడు పిడకలే కూతుర కూతుర / ఎద్దడినీళ్ళే కూతుర కూతుర
సేద్యగాడి బిడ్డలె కూతుర కూతుర / ఆగమయితిరే  కూతుర కూతుర
బతుకు మోయలేని మొగుడె కూతుర కూతుర / కాట్ల కలిసెనే కూతుర కూతుర
పెండ్లాము మీదనే కూతుర కూతుర / మిన్ను ఇరిగి వడెనే కూతుర కూతుర ”   సాగుతోంది
లయ తప్పకుండా అంతా ఒకే శృతిలో పడుతున్నారు మనసులోనే అభినందిస్తున్న వరుణ్ కేసి తిరిగి ‘ఎంత అర్ధవంతమైన పాట ‘.అన్నది  గట్ల మీద నడుస్తున్న క్రాంతి.
‘అవును , ఇది వింటుంటే మనం వచ్చే దారిలో సంఘటనపైనే పాట కట్టి పడుతున్నట్లుంది ‘ సాలోచనగా అన్నాడు వరుణ్
‘తమ బాధల్ని , గాధల్ని, సంతోష సంబరాల్ని అలా పాటలో చొప్పించేసి ఆశువుగా  పాడుకుంటూ ఉంటారు వీళ్ళు ‘  చెప్తున్న క్రాంతి మాటలకు అడ్డుతగులుతూ
 ‘ హే.. ఇటు చూడు , ఎన్ని రకాల మొక్కలు ..  క్యాబేజీ , కాలిప్లవర్ , ముల్లంగి , వంకాయ , ఉల్లి , మిరప , కొత్తిమీర , కరివేపాకు , బంతి , చేమంతి, మామిడి , బత్తాయి .. నేనెప్పుడూ చూడలేదు ఇన్నిరకాలు .. ‘   ఆశ్చర్యంతో జేబులోని  కెమెరా తీశాడు
‘అబ్బ ! .. ఎన్నేళ్ళయిపోయింది పొలం గట్లపై నడిచి ..’  చిన్నపిల్లలా సంబరపడిపోతూ పరుగు పరుగున మోటారుపంపు కేసి నడిచింది.
‘జాగ్రత్త.. ‘ అంటూ చేతిలో ఉన్న కెమెరాలో ఆ దృశ్యాల్ని మురిపెంతో బంధిస్తూ వరుణ్ .
‘గంట క్రితం మనసు పడిన యాతన అంతా ఎవరో పైపేసి లాగేసినట్లుంది వరుణ్ ‘ అని   చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని , అరచేతివెళ్ళని  గుండ్రంగా గొట్టంలా మడచి పంపు నుండి నీళ్ళు వచ్చే దగ్గర ఉంచి ఎంతో తేలికగా నీళ్ళు తాగింది .  ఆమెలో అమృతం తాగిన ఫీలింగ్ . చేతిలో ఉన్న కెమెరా క్రాంతికిచ్చి వరుణ్ కూడా అలాగే తాగడానికి ప్రయత్నించాడు . కానీ అలా తాగడం కుదరక ముఖమంతా నీళ్ళు చిప్పిల్లాయి . ఆ నీటి చుక్కలు మొహంపై , జుట్టుపై నిలిచి వింత సోయగంతో కనిపిస్తున్న అతన్ని వెనకనుండి కనిపించే అరటిగెలలను  ఫ్రేం లో పెట్టేసింది క్రాంతి.
ఎవరో పై ఆఫీసర్లు వచ్చారనుకుని చేస్తున్న పని ఆపి వచ్చిన నారాయణ ‘ఎవరు సార్ మీరు? ఏవనుకోకుండ్రి.  మిమ్ముల గుర్తుపట్టలే. ఈ చేను నాదే. నన్ను నారాయణ అంటరు ‘  తనను తాను పరిచయం చేసుకుంటూ
‘మేం మీకు తెలియదు నారాయణగారూ. ఇటుగా పోతున్నాం. మీ మోటరులోంచి పడుతున్న నీళ్ళు చూసి వచ్చాం, రావచ్చా .. . ‘ అతనికేసి పరీక్షగా చూస్తూ అడిగింది   క్రాంతి.
అట్లాగా అన్నట్లు తలూపి ముందుకు కదులుతున్న అతన్ని చూస్తూ ‘మేం ఇక్కడ కాసేపు కుర్చోవచ్చా’ నారాయణ వెనకే అడుగులేస్తూ వరుణ్ .
‘అయ్యో దానిదేముంది సారూ ఎంత సేపు కావాల్నంటే అంత సేపు కూసొండి ‘ చెమట తువ్వాలుతో తుడుచుకుంటూ
జామ చెట్టు నీడన కూర్చున్నారిద్దరూ.  జామ చెట్టుపై నుండి పక్కనే ఉన్న వేప, బొప్పాయి, దానిమ్మ చెట్లపైకి ఎగిరిన చిలకల గుంపుని , పిట్టల కిలకిలారావాల్ని వీడియోలో బంధించే ప్రయత్నం చేస్తూ వరుణ్ . ఏదో అద్భుతం చూసినట్లుగా అబ్బురపడుతూ క్రాంతి.
మట్టికొట్టుకుపోయిన కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొచ్చిన నారాయణ దోరగా ఉన్న జామకాయలు కోసి ఇద్దరికీ ఇచ్చాడు.
థాంక్స్ చెప్పి నెమ్మదిగా నారాయణతో మాటల్లో పడ్డారు ఇద్దరూ .
‘ఈ పొలాన్ని చూస్తే నా చిన్నతనం గుర్తొస్తోంది. మాకూ ఇట్లాగే బోరు బావి , రకరకాల కూరగాయలు, పండ్లు, వరి పండేవి. మీరు మీ పంటలతో నాకవన్నీ గుర్తుకుతెచ్చారు ‘ అభినందనగా  క్రాంతి .
‘ఏడేళ్ళ కిందట ఇది రాళ్ళూ రప్పలతో నిండిన దిబ్బ .  కాలమైతే ఇన్ని కందులో జొన్నలో అయ్యేవి. లేకుంటే లేదు. అసొంటి చేన్ల గిట్ల బంగారం పండిత్తనని కలల బీ అనుకోలే.  వేణుబాబు పుణ్యమాని నేనిప్పుడు ఆదర్శ రైతుగా నిలబడ్డ’  కించిత్ గర్వంగా చెప్పుకొచ్చాడు నారాయణ  .
‘నిజమా .. ఆశ్చర్యంగా  ఉందే .. ‘ కళ్ళు పెద్దవి చేసిన వరుణ్
‘అవు సారూ .. కాలువ నీళ్ళు రాని మిట్ట భూములు మావి. మా ఊరు, చేన్లు ఉన్నదే బొగడ మీద. మా ఊరి శివారు అంతా ఇంతే. తరి లేదు. జొన్న , శనగ, కంది వర్షాధార పంటలే.  అవి చేతికి అందొచ్చేవి కావు. అడవి పందులు, అడవి దున్నలు నాశనం చేత్తుండే . అవి తిని తోక్కేసినంక మిగిలినవే ఇంటికోచ్చేది. దాదాపు అందరి పరిస్థితి ఇట్లనే  ఉండే.
“మీదే ఊరు ? ‘
 కొండకు దిగువగా కనిపిస్తున్న ఊరును చూపుతూ ‘అగ్గో .. గదే మా ఊరు .  మిట్టపల్లె . తలకాయ లెక్క ఉన్న గుట్ట కింద మా ఊరు.  మా ఊరి చుట్టు ముట్టుతా ఏరు పారతది.  కానీ మిట్ట మీద ఉన్న మా చేన్లకు చుక్క నీరు ఎక్కదు.  వాననీరు కూడా కిందకే బాటపడుతుండే. బోర్లేసినా పాతాళగంగమ్మ తల్లికి కనికరం లేక పాయె.  ఏమ్జేత్తమని నెత్తి నేలకేసి, లేకుంటే అస్మాన్ కేసి ఆశగ జూస్తుంటిమి.  చినుకు రాల్చక పొతదా అని .
కిందకు బోతే ఆ ఊర్లల్ల నీళ్ళు , పంటలు మంచిగ ఉంటుండే. మాకేమో జరుగుబాటు లేకపాయె.  అప్పులు పెరిగిపాయె.  బతికే మార్గం కానరాకపాయె. బ్యాంకుల్ల ఏడ అప్పు పుట్టకపాయె. కలో గంజో తాగి బతుకుదమని ముసలోల్లను ముతకోల్లను ఇంటికాడొదిలి  జనం పట్నం బాటపట్టె.  అగ్గో గప్పుడచ్చిండు మా ఊర్ల బడికి లస్మయ్య సారు. ఆ సారు అందరు సారుల్లెక్క కాదు. పట్నంల ఉండక పోతుండె . మా ఊల్లెనె చిన్నఇల్లు కిరాయికి తీసుకున్నడు.   ఊర్లె బడికి వచ్చేటి పొల్లగాండ్లు ఎందుకింత తక్కువున్నరో విచారం జేసిండు.  ఒకనాడు  బయటికి పోయి మస్తు చదివి పట్నంల పెద్ద నౌకరీ జేస్తున్న ఆయన కొడుకు వచ్చిండు. పిల్లల గురించి , మా యాతనల గురించి మాటల్ల మాటగా  కొడుకు వేణుబాబుతోని చెప్పిండట ఆ సారు.  ఆ పిల్లగాడి దిమాక్ తిరిగి పోయిందట .  అసలే  మట్టి అంటే పానం పెట్టేటి వేణుబాబు పట్నం నౌకరీ ఎడమకాలితోటి తన్నేసి ఈడనే ఉన్నడు.  ఊర్లనె ఉంటనని చేను కౌలుకు చేసిండు . ఏం ఫాయిదా లేకపాయే.  తండ్రులు  తాతల కెల్లి మేం మడి చెక్కనే నమ్ముకొని బతికేటోల్లం.  పెద్దపెద్దోల్లె మాతోటి అయితలేదని కాడి ఇడిత్తే నువ్వేడ సేద్యం జేస్తవని ఊర్లొల్లు మస్తు జెప్పిన్రు .. పో .. పోయి పట్నంల మంచిగ బతుకుమని అన్నరు. ఇన్నడా .. ఆ బిడ్డడినలే .

వేణుబాబచ్చినంక మాకెరక లేని కొత్త కొత్త ముచ్చట్లు .. ఒకటా రెండా మాస్తు మా ఊర్లకు తెచ్చిండు . ముందుగాల్ల  మేము ఆ బాబు చెప్పింది చెవినబెట్టలే .  మట్టి మీద కొడుకుకున్న ప్రీతి జూసి లస్మయ్య సారు తను జమేసుకున్న పైసలన్నీ తీసి 5 ఎకరాలు కొనిచ్చిండు. బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ లేపిండు. మొదటేడు పంట ఏం రాలే . బోర్లు ఏసిండు. నీళ్ళు పడలే.  250 అడుగులు దించిన ఒంటేలు పోసినట్టు పోసుడు తప్ప ఏం లేదు. పట్నం పోయి ఎవరేవర్నో కలిసేటోడు. పెద్ద పెద్ద సార్లెంటవడి ఆల్లను ఈల్లను మా ఊరికి తెచ్చేటోడు.  వానలు పడేవరకంటే తన చేను చుట్టూత కందకం తవ్విచ్చిండు. అట్ల ఊర్ల ఇంత పని దొరికింది . వానలు పడ్డయి. చుక్క నీరు బయటికి పోలే. అంతా ఆడనే ఇంకి పొయ్యేది . అట్ల ఎడాదేడాది నీళ్ళు పెరిగినయ్. బోర్లు మంచిగ పొస్తున్నయ్.  ఏదో ఒక్కటే పంట ఏసుడు గాదు ..  ఆ భూమిల ఏ పంట ఎత్తే బాగా పండుతదో తెలుసుకొనొచ్చి అవ్వే పంటలు ఏసిండు.  ఎరువులు వాడలే. గడ్డిగాదమేసి ఎర్రలు, నట్టల ఎరువు తయారు చేసి అదే ఏసిండు. పురుగు మందులు కొట్టలే. చేన్లో ఉన్న వేప,తంగేడు, కానుగ ఏవోవో కలిపి ఆకుల కాషాయం చేసి కొట్టిండు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట తీసిండు.  పక్కనే ఉన్న చేను అమ్ముతంటే తల్లి బంగారం అమ్మి చేను కొనుక్కొమ్మని కొడుక్కు ఇచ్చింది. మల్ల 5 ఎకరా కొన్నడు.  రైతులతోని సంగం పెట్టిండు.  మా ఊర్ల ఎన్నడు లేని కొత్త కొత్త పంటలొచ్చినయ్.  పూల తోటలు , పండ్ల తోటలు , పండ్ల మొక్కల నడుమ  కూరగాయల తోటలు చూసి మా దిమాక్ కరాబయింది. అదే ఊరు. అదే నేల. అప్పటికి ఇప్పటికి ఎంత ఫరక్ .. నక్కకు నాగలోకానికున్నంత . చేనుకు ఎంత జేస్త్తే అంత చేపిచ్చుకుంటది. అట్లనే ఇంత బువ్వ పెట్టి సల్లంగ చూస్తదని మాకర్థమయింది.   ఊర్ల  ఒకోక్కళ్ళు వేణుబాబునడిగి కొత్త తీరుగ సాగు షురూ చేసిన్రు.

అగ్గో ..గప్పుడే  ఊర్ల బతుకేలేదని పట్నం బోయిననేను పనిమీద ఊర్లకొచ్చిన. మా ఊర్లనే బంగారం పండిచ్చిన వేణుబాబు సుద్ది ఇన్నంక దిమాక్ తిరిగిపోయింది . పట్నం బతుకు యాష్ట ఎరకైంది గద.  ఆడ గాదు ఈడనే  బతుకని వెనక్కొచ్చి తిండి కోసం కొంచెం వరి , గోధుమ , జొన్న , పెసర , సోయా , గట్లకు కంది, సీజను బట్టి కూరగాయలు, పూలు పండిస్తున్నా. నాలుగు బర్లు పెట్టుకున్న. ఇంటికాడ కోళ్ళు , మ్యాకలు ఉండనే ఉన్నయి. ఈ చేన్లల్ల, ఇంటికాడ  ఇంత జాగ పోనియ్యం . ఏకాలంల పంటలు ఆ కాలంల తీస్తున్నం.  మా ఊర్ల దాదాపు వెయ్యి ఎకరాలల్ల  కందకాలు , చిన్న నీటి కుంటల తోటి నీటి నిల్వలు పెంచుకున్నం.  ఇప్పుడొక్క చుక్క నీరు కిందికి పోదు.  ఒక్క వాన బొట్టు రాలిన అది మా నేలల్నే ఇంకుతది.   తిండికి , బట్టకు, తాగు నీటికి , సాగు నీటికి కొదువలేదు . బంగ్లా కాకున్న  ఉండేతందుకు  చిన్నగా ఇల్లు కట్టుకుంటున్న . పిల్లలను మా ఊరి బడిలోనే చదివిపిస్తున్న. కూలి నాలీ చేసుకొని బతికే నారిగాడు ఇప్పడు  రైతుగా నిలబడ్డడు.’  మోహంలో తళుకు లీనుతున్న విజయగర్వంతో, ఆత్మవిశ్వాసంతో  నారాయణ .

‘ గ్రేట్ .. రియల్లీ గ్రేట్ నారాయణ గారూ ‘ అంటూ షేక్ హాండిచ్చాడు వరుణ్
‘ వండర్ ఫుల్ . చాలా ఆనందంగా ఉంది మీ విజయ గాధ వింటుంటే .. ‘ చప్పట్లు చరిచి విస్మయంగా చూస్తూ క్రాంతి
తనని పోగిడినందుకు కొంచెం బిడియ పడుతూ ‘నా ఒక్కడిదే కాదు మా ఊల్లొ దాదాపు అందరి విజయమే ఇది’ ,
‘అదెలా సాధ్యం ?’
‘అందరం కలసికట్టుగ ఒక్క మాట మీన  ఉంటం.   ఊరు చిన్నదే,  గానీ గప్పుడయితే మూడు పార్టీలు ఆరు గొడవలు .. ఇప్పుడు చేనుకు చేవ రైతుకు రొక్కం అన్నట్టుంది. వేణుబాబు, ఇంకొందరు రైతులయితే గట్ల పొంటి టేకు , మామిడి , జామ, కొబ్బరి నాటిన్రు.  నేను కొన్ని గట్లకు కంది , కొన్ని గట్లకు బెండ , కొన్ని గట్లకు పుంటికూర ఏసిన.  గా ఎనక గట్లకు కొబ్బరి , మామిడి అంట్లు నాటిన .
గాపొద్దు చేతిల చిల్లపెంక లేక ఎంత యాతన పడ్డనో నాకే ఎరుక. ఇప్పుడా బాద లేదు. గాసం తిండిగింజలు , కూరగాయలు , ఆక్కురలు ఏదీ కొనేదే లేదు. పాలు కొనేది లేదు. పండ్లు ఫలాలు కొనేది లేదు. గుడ్లు , మాంసం కొనేది లేదు . గొడ్డు గోదల పెంట చేన్లకు ఎరువు అయ్యే . అంటే ఆ కర్సంత లేనట్టే గద . ఇంట్లకు వాడుకోంగ మిగిలిన పండ్లు పలాలు, పాలుగుడ్లు అమ్మితే చేతిల పైసలు తిరుగుతాన్నయి.
అప్పుడు అడవికి పొయ్యి కట్టెలు తెచ్చి పొయ్యి ముట్టిత్తున్టిమి. సర్కారుతోని మాట్టాడి సబ్సిడీ తోని గోబర్ గ్యాస్ పొయ్యి , ఒక లైటు పెట్టిన్చుకున్నం.  ఊరికి సోలారు కరెంటు పెట్టియ్యాల్నని వేణుబాబు తిరుగుతున్నడు. ఆయన చేన్ల బీ మోటారు సోలారుదే పెట్టిన్చ్చిండు.  మంచిగనే నడుత్తాంది. మేము అదే బాట పట్టాల్నని అనుకున్టాన్నం .
‘ ఏవయ్యో .. తినవా .. ‘ దూరం నుండి పిలుపు
‘అస్త అస్త .. నువ్వు తిను ‘ అంటూ గట్టిగా చెప్పి ‘ మా ఇంటిది ‘ అన్నాడు
‘అవునా అన్నట్టు చూస్తున్న క్రాంతి కేసి తిరిగి ‘మా ఆడోళ్లు ఇంట్ల కూసోరు మేడం. కూలోల్లతోటి నడుమొంచుతరు’
‘మీ పంటని మార్కెట్ ఎలా చేస్తారు ‘ వరుణ్ సందేహం
‘బేరగాళ్ళు మా కాడికే వస్తరు. మార్కెట్ రేటు ఎంతుండచ్చో అందాజ మా ఊరి రేడియోలో వేణుబాబు చెప్తడు. దాన్ని బట్టి ఒకరేటు అనుకొని అట్లనే ఇస్తం. ‘
‘రేడియో నా ..”
‘అవును మేడం , మా ఊర్లొ కమ్యూనిటి రేడియో పెట్టిచ్చిండు వేణుబాబు దోస్తు .   ఆనాటి కెల్లి మా ఊరి పేరు మస్తు దూరంబోయింది.
‘అమేజింగ్ .. ఏమి చెప్తారు మీ రేడియో లో ‘ ఉత్సాహంగా  క్రాంతి ప్రశ్న
‘ఒకటేమిటి  సేద్యానికి, పసులకు , కోళ్ళకు సంబంధించి ముచ్చటించుకునే ముచ్చట్లు ఎన్నో .. అదునుల ఏసేటి పంటలు ,  విత్తనాలు , రోగాలు, రోస్టులు  మందు మాకు, లోన్లు , సబ్సిడీ .. అన్నీ .. మా  రేడియలొస్త్తయ్ . అనుభవాలు చెప్పుకుంటం.  మా  రేడియో ల ముచ్చట్లన్నీ మాయే .. మా గొంతులకెల్లే   .. ‘ ఉద్వేగంతో నారాయణ చెప్పుకుపోతున్నాడు
‘రేడియో ద్వారా మీ గొంతు వినిపించడం చాలా గొప్ప విషయం కదా ..’
‘అవు మేడం .  ముందుగాల్ల బయంతోని పరేషాన్ అవుతుండే .  ఇప్పుడదేం లేదు . మా ఊరి పొల్లలిద్దరు  రేడియో ప్రోగ్రాంల ట్రైనింగ్ బీ  తీసుకున్నరు .  పట్నం సార్లోచ్చి  వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన్రు.
‘ఇవన్నీ చేస్తుంటే మీకు ఇబ్బందులు రాలేదా .. ‘
‘అహ్హహ్హ ..’  నవ్వి ‘రాకుంట ఉంటయా ..సారూ … ఒక్క అడుగు ముందుకువడ్తే నాలుగడ్గులు ఎనక్కి ఇగ్గేటి గుంటనక్కలు మస్తు ఉంటయి గద .. ఊకుంటయా.. ? ఎన్ని జేసిన ఏమయితది మిగతా జనమంత  ఒక్క దిక్కు ఉన్నంక . ఉన్నడు గద వేణుబాబు.  అనుకున్నది అయ్యేదంక .. ఆళ్ళని నిద్దుర పోనియ్యలే . అట్లనే మమ్ముల నిద్దుర పోనియ్యలే .  ‘
‘అవునా చాలా ఆశ్చార్యంగా ఉందే .. ఇప్పుడే వస్తూ దారిలో రైతు ఆత్మహత్య ని చూసొచ్చాం ‘ గంప నెత్తిన పెట్టుకొని అటుకేసి వస్తున్న నారాయణ భార్యని చూస్తూ అడిగింది క్రాంతి .
‘మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఊళ్ళో ఆత్మహత్యలు .. ‘ అనబోతున్న వరుణ్ మాటల్ని అడ్డుకుంటూ  ‘లేవు, సారూ .. లేనే లేవు . ఒకప్పుడు మస్తు ఉంటుండే. ఇగ ఇప్పుడు రావు కూడా ‘ ఆత్మవిశ్వాసంతో చెప్తున్న అతన్ని
‘అంత ఖచ్చితంగా చెప్తున్నారు .. ఎలాగో తెలుసుకోవచ్చా ?’ ఆసక్తిగా వరుణ్
‘మట్టిని నమ్ముకుని బతుకే బతుకులుమాయి. నమ్ముకున్న  భూతల్లి నమ్ముకున్నోడిని అన్యాలం చెయ్యవట్టే .. కాలం కల్సి రాకపాయె .   కుటుంబం పెరిగే.   ఖర్చులు పెరిగిపోయే. భూమి పెరగక పోయే . లేని అలవాట్లు ఇంట్లకోచ్చే . తాగుడు ఎక్కువయ్యే . సోకులు సరదాలు ఎక్కువయ్యే . పోకళ్ళు తగ్గకపాయే . తినేటి తిండిలో పస లేకపోయే . అంత మందుల తిండి . కొత్తకొత్త రోగాలు పుట్టుకొచ్చే .  ఆరుగాలం కష్టం  చేసిన పైస కల్లు సారా దుకాన్లల్లకు , దవాఖాన్లల్లకు జారిపోయే .. . అప్పోసోప్పో చేసి దుబాయ్ పోయి ముల్లె తెస్తారనుకుంటే ముల్లుగర్ర రాకపాయే . చేసిన ..అప్పు నెత్తి మీద మిగిలి ఆ బరువు పెరిగిపోయె.  సేవసచ్చిన సర్కారు సప్పుడు సేయక పాయె.  ఏమ్జేత్తరు..?  కిస్తీలు కట్టలేక మానేదతో మట్టిలో కల్సిపోవుడు తప్ప ..  నేను ఇట్ల ఉన్ననంటే అంతా వేణుబాబు సలువే .. ‘

‘శ్రీరాంపురంలో  రైతు మల్లయ్య ఎట్లా చనిపోయాడు ‘ జామకాయ తొడిమ విసిరేస్తూ
‘ఏమున్నది  సారూ .. ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నరు . ఆళ్ళు చిన్నగున్నప్పుడే అన్నల దళంల కల్సిండు. పాపం ఆమెనే తల్లీ తండ్రి అయి సాకింది.  పదేండ్ల కిందట దళంలో కెల్లి వెనక్కచ్చిండని సర్కారు కొన్ని పైసలిచ్చింది . నాయిన ఇచ్చిన పదెకరాల మడిచెక్క ఉన్నది . మర్సిన  సేద్యం షురూ జేసిండు. కాలం కాలే.  కాల్వ నీళ్ళు మస్తు పారే పల్లం భూమిల నీళ్ళు లేక బోర్లేసిండు . ఒక్కటి కాదు రెండు కాదు ఆరేడు బోర్లేసిండు ఒక్కటి సరిగ్గ నీళ్ళు పొయ్యక పాయే . పెట్టిన పెట్టుబడి మట్టిలగల్సే . అప్పులే మిగిలే . మంచి సంబందమొచ్చిన్దని అప్పులో అప్పు చేసి అదే టైంల పెద్ద బిడ్డ లగ్గం జేసిండు .  అప్పు మీద అప్పు మిగిలే .. చేను అమ్మేసి అప్పులు తీరుస్తనని ఐదు ఎక్రాలు అయినకాడికి అమ్మిండు. అప్పులు తీరకపాయే . బ్యాంకు లోన్లు రాకపాయే.  సేతిల పెట్టువడి లేకపాయే . మిగిలిన చేన్ల రెండెకరాలమ్ముతనని జూసిండు. కొనేటోళ్లు లేకపాయే .. అప్పులిచ్చినోల్లు నెత్తి మీద కూసునే .. బాగ బతికిన కుటుంబం . ఒకప్పుడు ధాన్యం నిలువలున్న కుటుంబం . నలుగురికీ సాయం చేసిన కుటుంబం .  బెల్లం చుట్టూ ఈగల్లెక్క ఉన్న సుట్టాలు ఇప్పుడు దూరమయ్యె. అంటుకుంటే ఆ దరిద్రం తమకంటుకుంటదేమోనన్న భయంతోని. సేతిల సిల్లపెంక లేకున్న తాగుడు బందుకాలే .  పట్నం పోయిఏదన్న  పని చూసుకుంటనని పోయిండు. వారం పదిదెసాలు కాలే. ఇగో గిట్ల కట్టె వచ్చే’ జీర బోతున్న గొంతుకలో ఏదో అడ్డుపడ్డట్టు ఆగాడు నారాయణ .
‘అతను రైతు కాదు వడ్డీ వ్యాపారి. అందరికీ అప్పులిస్తాడు . ఇచ్చిన అప్పులు రాక ఉరేసుకున్నాడు అని ఈ రోజు పేపర్ లో ఇచ్చారు’ అర్దోక్తితో ఆగాడు వరుణ్
‘అట్లనా సారూ.. సేతిల సిల్లపెంక లేనోడు అప్పులేడ ఇత్తడు సారూ …  ఓ ఎన్నడో  తెల్సినోల్లకి సాయం జేసిండు. అది ఇప్పటి ముచ్చట కాదు, అన్నల్ల కల్వక ముందు ముచ్చట’  .
‘ మేం  వస్తుంటే రాస్తా రోకో చేస్తున్నారు . మేం మా కారు పక్కన పెట్టుకొని విషయం అడిగితే అక్కడి వాళ్ళు చెప్పారు. అతని పరిస్థితి.  మేమూ ఆ రైతు ఇంటిదాకా వెళ్లాం . అక్కడి పరిస్థితి మమ్మల్ని కలచి వేసింది. బతికిన కుటుంబమని , రైతు కుటుంబమని అక్కడి వాతావరణం చెప్తోంది . కరువు బాధలు ఇంత భయంకరంగా ఉంటాయా అని ఆలోచిస్తూ వస్తున్నాం …
‘అవు సారూ .. రైతు బతుకు ఇట్లేన్దుకయితాంది సారూ .. రోజు రోజుకీ పెట్టువడి  పెరిగిపోయే . కంపెనీ మందులు వాడుడుతోని కర్సు పెరిగిపోయే. వచ్చే ఆదాయం తక్కువాయే ‘
‘మరి మీకు వస్తోందిగా ..”
‘మేము సోమ్ముపోసి ఎరువులు కొన్టలేము. కొన్నా ఏదో కొద్దిగా . మా రేడియో చెప్పిన దాన్ని బట్టి కొనటం . అంతే. యాపాకు, యాపకాయ ,కనుగాకు, కనుగగింజలు, ఆవు పెండ , ఆవు మూత్రం,అన్ని మాకు మందులు ఎర్వులు. పోరుగూర్లకు పొతే ఏది అవుసరమో , ఎంత అవుసరమో చూడకుంట కుమ్మరిస్తున్నరు, పురుగుమందులు అంతే .. అన్ని రెట్లు పెరిగినట్టే కూలీ పెరిగే . కర్సు పెరిగిపోదా ..  పెరిగిన కర్సుకు తగ్గట్టు పంట ఉన్నదా .. లేకపాయే.  పంట వచ్చినా దర ఉన్నదా లేకపాయే ..  దళారి కొనుక్కు పోయినంక సర్కారు మద్దతు దర ఇస్తది.  అది అని జేబులకు పోతది .  ఏం జెప్పాలె సారూ .. ‘
‘ఆత్మహత్య చేసుకున్న రైతుకు ప్రభుత్వం ఐదారు లక్షలు ఇస్తుందని అంటున్నారు .. ‘
‘రైతు పానం పోయినంక లక్షలు ఎంతిత్తే ఏం ఫాయిదా సారూ .. పోయిన మనిషి తిరిగొత్తడా .. ? ఆ ఇంటి కస్టాలు తీరతయా.. ఆ రైతు మీదికి సావు రాకుంట సెయ్యాలె ..ఆ  ఇంటిదానికి గోసకాకుంట సేయాలె ‘ అప్పటి వరకూ వింటూ నించున్న  నారాయణ భార్య ఆవేదనగా
‘ఏమో అనుకున్న మంచి ముచ్చటజెప్పినవ్ ‘ అని భార్య వైపు అబినందనగా జూసి ‘అవ్ సారూ .. సేద్యపు కర్సులు తగ్గి పంటలు మంచిగ తీసేటట్టు సెయ్యాలె. వచ్చిన పంటకు తగ్గ రేటు రావలె

“వ్యవసాయ గురూ వేణుబాబులాంటి వారు ఊరికొక్కరు
ఉంటే ..” అంటున్న వరుణ్ మాటల మధ్యలోనే అందుకొని
‘అది సర్కారు బాధ్యత కాదా ..  ‘ కొంచెం ఆవేశంగా క్రాంతి
‘అవ్ రైతు సుత తీరు మార్సుకొవాలె మేడం. పెయ్యి వంపకుంట పై పైన తిరుక్కుంట సేద్యం అంటే ఇట్లనే ఉంటది. నాత్రిపగలు సూడకుంట తన కుటుంబం , తన సేద్యం మీద రైతు మనసుపెట్టాలె . పట్టుదలతోని కష్టపడాలె.  కాలం కాలేదని ఏడ్సుడు కాదు పడ్డ నీటి చుక్క ఒడ్సి పట్టాలే.  సదువు లేని మా అసొంటోళ్ళకు సర్కారే అన్డకావాలే.  అదను పదను ముచ్చట్లు  సేద్యగాని కాడికి తేవాలె .  మా వేణుబాబు ఒక్కడే ఇంత జేస్తున్నడు. ఇప్పుడు మా ఊల్లె కాడి ఎత్తుకునేటోడేగానీ దింపేటోడే లేడు.  సర్కారు కాడ మా లెస్స మంది ఉన్నరు. ఆల్లంత ఇప్పుడు మా ఊరుకోసం అంత ఆల్లే జేసినట్టు మస్తు చెప్పుకోవట్టిరి . అట్లయితే అన్ని పల్లెలు మా ఊరి లెక్క ఉండాలె గద .. ? ఈ సావులన్నీ ఎందుకయితాన్నయ్ ..? ‘ తలగోక్కుంటూ నారాయణ ప్రశ్న
నిజమేనన్నట్లు తలూపారు వరుణ్ , క్రాంతి లిద్దరూ
‘మన సేనుకు , మన కుటింబానికి మనమేమి జెత్తున్నమని రైతు ఇచారం జెయ్యాలె.  పత్తలాడుకుంట, సారా దుకాన్లు , కల్లు దుకాన్ల పొంట తిరుక్కుంట పనుల్లేవని తిట్టుక్కుంట నెత్తిబట్టుకొని కూకుంటే ఎట్ల ..? ఏదోటి జెయ్యాలె .. ఏమ్జేయ్యాల్నో ఇచారం జెయ్యాలె .. ఆడిదాన్ని అంగట్లొదిలి పొతే ఎట్ల ..? గుండెపగిలి ఏడ్సె ఇంటిదాని మొకం కనవడదా .. బిక్కి బిక్కి ఏడ్సె పోల్లగాల్ల మొకం కానరాదా .. ఇంటోడు ఆయింత ఆలోచన చెయ్యకుంట తప్పిచ్చుకు పోతున్నడు ‘ ఆవేదనగా అంది గంపలోని కీరా దోసకాయలు తీస్తూ నారాయణ భార్య .  ఒక్క క్షణమాగి ఆమె

‘ మేమంటే ఈ ఊర్ల ఉండవట్టి ఓ తీరుగఅయినం. మా అన్నదమ్ములు మా తీర్గ సేద్యం చెయ్యనికి సెప్పెటోల్లు ల్యాకపాయే. గాల్లో దీపంబెడ్తే ఆగుతదా .. అప్పులు చుట్టుముట్టి పరేశాన్ల ఉన్నరు.  ఓట్ల పండుగడొచ్చినప్పుడు రైతులకవిజేత్తం ఇవి జేత్తం అని అందరు జెప్పుడే గానీ సేసెటోడు  లేకపాయే .. రైతు మంచిగుంటేనే తినేతందుకు లోకానికి ఇంత ముద్ద దొరుకుతదని సర్కారుకు ల్యాకపాయే .  ఏవియ్యకున్న ఆపదలున్న రైతుకు ఇంత దైర్నం జెప్పెటోడు ల్యాకపాయే .. ఎట్ల ముంగట పడాల్నో నేర్పెటోడు ల్యాకపాయే .. పిట్టల్లెక్క చేన్లల్లనే రాలిపోతున్నరు. రైతు కష్టం లోకానికే అరిష్టం అని తెల్సుకో కొచ్చిరి ‘ . మనసులో అన్నదమ్ముల గురించిన బాధ సుడులు తిరుగుతుండగా  ఆవేదనగా అంది నారాయణ భార్య
‘అవు సారూ ..ఊరుకొక్కల్లు దైర్నం జెప్పెటోడు ఉన్నా ..ముంగటేసేటోడు ఉన్న .. ఇట్లగాకపోను’ సాలోచనగా అన్నాడు నారాయణ
కీరా దోసకాయలు చేతిలో ఉన్న చాకుతో ముక్కలు కోసి క్రాంతి చేతిలో పెట్టింది నారాయణ భార్య .
‘ ఊరికే  వద్దు . మీ తోటలో ఉన్న ఆకుకూరలు ,కూరగాయలు , పండ్లు అమ్మితే కొనుక్కుంటాం’ దోసకాయలు అందుకుంటూ అంది క్రాంతి .
మా దగ్గరకొచ్చిన సుట్టాలు మీరు ఇవి తినండి . ఎన్ని కూరగాయలు కావాల్నో చెప్తే తెమ్పుకొస్త అంది నారాయణ భార్య .
‘మేమూ మీతో పాటు తోటలోకి వచ్చి కూరగాయలు కోయొచ్చా .. ‘ సందేహంగా క్రాంతి
నవ్వుతూ ఆహ్వానించింది ఆమె. ఆ వెనకే వాళ్ళు ఈ రోజు లాంగ్ డ్రైవ్ మిగిల్చిన కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ.. వ్యవసాయ గురూ గురించి ఆలోచిస్తూ.. ముందుకు కదిలారు 

వి. శాంతి ప్రబోధ

ఒక్కసారిగా దృశ్యం మారిపోయింది .  నూట ఎనభై మైళ్ళ ప్రయాణంలో దాదాపు ఒకే విధమైన వాతావరణం, పెద్దగా మార్పు లేని దృశ్యాలూ చూసి విసుగొచ్చి వెనక్కి మరలుదాం అనుకొంటుండగా  ఏదో అద్భుతం జరిగినట్లు ప్రకృతి దృశ్యం మారిపోయి . అప్పటివరకూ చూసిన దానికి భిన్నంగా ..  వారి కళ్ళకు, శరీరానికి , మనస్సుకు ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ .. పచ్చదనం సింగారించుకున్న ప్రకృతి

‘ ఎమేజింగ్ వరుణ్ ..  ఎంతలో ఎంత వ్యత్యాసం .. ‘ ఆశ్చర్యంగా అంది క్రాంతి కళ్ళు విప్పార్చుకుని చూస్తూ
‘య్యా .. రియల్లీ .. , అన్ బిలీవబుల్ ‘  కారు నడక వేగం తగ్గింది. కారు ఏసీ ఆఫ్ చేసి విండో డోర్స్ తెరిచారు.
‘స్వచ్చమైన చల్లని పైర గాలి తగులుతుంటే భారమైన మనసుకు ఎంతో హాయిగా ఉంది కద వరుణ్ ‘ ఆ గాలిని ఆస్వాదిస్తున్న క్రాంతి
‘అవును ‘, అంటూ కారు ఆపాడు .
‘ఏంటి వరుణ్ ఇక్కడ ఆపావు ‘
‘అటు చూడు డియర్ .. ఆ పంపు ఎంత నిండుగా నీళ్ళు చిమ్ముతోందో .. పద కొంచెం సేపు ఆ గట్టున ఉన్న చెట్ల కింద కూర్చో వచ్చేమో చూద్దాం ‘ అన్నాడు వరుణ్
‘ఓ గ్రేట్ ఐడియా, కానీ .. వాళ్ళు ఏమంటారో ‘ దూరంగా పొలంలో పని చేసుకుంటున్న వారిని చూసి సందేహం వెలిబుస్తూ కారు దిగింది క్రాంతి . కారు ఓ పక్కకి లాక్ చేసి వచ్చాడు వరుణ్.
పొలం చుట్టూ ఉన్నగోరింటాకు  పెన్సింగ్ దాటుతూ ‘ ఏయ్ వరుణ్, ఇటు చూడు .. ఇది గోరింటాకు ‘ అంది రెండు ఆకులు కోసి పరీక్షగా చూస్తూ .
‘ ఓ అవునా .. కానీ.,  ఏ మొక్క మీద చెయ్యి వేయకు ‘ సలహా ఇచ్చాడు వరుణ్ .
ఇద్దరూ పచ్చని పొలం గట్ల మీద జాగ్రత్తగా నడుస్తున్నారు. బారులు తీరిన బంతి , చేమంతి పూల తోటలు, వాటిపై తిరుగాడే తుమ్మెదలూ..  పూలు కోయడంలో నిమగ్నమైన మహిళలు వీళ్ళ కేసి చూసి తమ పనిలో.  ఒకరు మడిలో కరివేపాకు కొమ్మలు కత్తిరిస్తూ .. మట్టి పరిమళాలకు తోడైన కరివేపాకు సువాసనలతో కలసి వారి గొంతులోంచి జాలువారుతున్న జానపద గీతం అలుపూ సొలుపూ తెలియకుండా
శ్రీరాంపురమే కూతుర కూతుర / చీపురుకట్టే కూతుర కూతుర
ఏడు పిడకలే కూతుర కూతుర / ఎద్దడినీళ్ళే కూతుర కూతుర
సేద్యగాడి బిడ్డలె కూతుర కూతుర / ఆగమయితిరే  కూతుర కూతుర
బతుకు మోయలేని మొగుడె కూతుర కూతుర / కాట్ల కలిసెనే కూతుర కూతుర
పెండ్లాము మీదనే కూతుర కూతుర / మిన్ను ఇరిగి వడెనే కూతుర కూతుర ”   సాగుతోంది
లయ తప్పకుండా అంతా ఒకే శృతిలో పడుతున్నారు మనసులోనే అభినందిస్తున్న వరుణ్ కేసి తిరిగి ‘ఎంత అర్ధవంతమైన పాట ‘.అన్నది  గట్ల మీద నడుస్తున్న క్రాంతి.
‘అవును , ఇది వింటుంటే మనం వచ్చే దారిలో సంఘటనపైనే పాట కట్టి పడుతున్నట్లుంది ‘ సాలోచనగా అన్నాడు వరుణ్
‘తమ బాధల్ని , గాధల్ని, సంతోష సంబరాల్ని అలా పాటలో చొప్పించేసి ఆశువుగా  పాడుకుంటూ ఉంటారు వీళ్ళు ‘  చెప్తున్న క్రాంతి మాటలకు అడ్డుతగులుతూ
 ‘ హే.. ఇటు చూడు , ఎన్ని రకాల మొక్కలు ..  క్యాబేజీ , కాలిప్లవర్ , ముల్లంగి , వంకాయ , ఉల్లి , మిరప , కొత్తిమీర , కరివేపాకు , బంతి , చేమంతి, మామిడి , బత్తాయి .. నేనెప్పుడూ చూడలేదు ఇన్నిరకాలు .. ‘   ఆశ్చర్యంతో జేబులోని  కెమెరా తీశాడు
‘అబ్బ ! .. ఎన్నేళ్ళయిపోయింది పొలం గట్లపై నడిచి ..’  చిన్నపిల్లలా సంబరపడిపోతూ పరుగు పరుగున మోటారుపంపు కేసి నడిచింది.
‘జాగ్రత్త.. ‘ అంటూ చేతిలో ఉన్న కెమెరాలో ఆ దృశ్యాల్ని మురిపెంతో బంధిస్తూ వరుణ్ .
‘గంట క్రితం మనసు పడిన యాతన అంతా ఎవరో పైపేసి లాగేసినట్లుంది వరుణ్ ‘ అని   చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని , అరచేతివెళ్ళని  గుండ్రంగా గొట్టంలా మడచి పంపు నుండి నీళ్ళు వచ్చే దగ్గర ఉంచి ఎంతో తేలికగా నీళ్ళు తాగింది .  ఆమెలో అమృతం తాగిన ఫీలింగ్ . చేతిలో ఉన్న కెమెరా క్రాంతికిచ్చి వరుణ్ కూడా అలాగే తాగడానికి ప్రయత్నించాడు . కానీ అలా తాగడం కుదరక ముఖమంతా నీళ్ళు చిప్పిల్లాయి . ఆ నీటి చుక్కలు మొహంపై , జుట్టుపై నిలిచి వింత సోయగంతో కనిపిస్తున్న అతన్ని వెనకనుండి కనిపించే అరటిగెలలను  ఫ్రేం లో పెట్టేసింది క్రాంతి.
ఎవరో పై ఆఫీసర్లు వచ్చారనుకుని చేస్తున్న పని ఆపి వచ్చిన నారాయణ ‘ఎవరు సార్ మీరు? ఏవనుకోకుండ్రి.  మిమ్ముల గుర్తుపట్టలే. ఈ చేను నాదే. నన్ను నారాయణ అంటరు ‘  తనను తాను పరిచయం చేసుకుంటూ
‘మేం మీకు తెలియదు నారాయణగారూ. ఇటుగా పోతున్నాం. మీ మోటరులోంచి పడుతున్న నీళ్ళు చూసి వచ్చాం, రావచ్చా .. . ‘ అతనికేసి పరీక్షగా చూస్తూ అడిగింది   క్రాంతి.
అట్లాగా అన్నట్లు తలూపి ముందుకు కదులుతున్న అతన్ని చూస్తూ ‘మేం ఇక్కడ కాసేపు కుర్చోవచ్చా’ నారాయణ వెనకే అడుగులేస్తూ వరుణ్ .
‘అయ్యో దానిదేముంది సారూ ఎంత సేపు కావాల్నంటే అంత సేపు కూసొండి ‘ చెమట తువ్వాలుతో తుడుచుకుంటూ
జామ చెట్టు నీడన కూర్చున్నారిద్దరూ.  జామ చెట్టుపై నుండి పక్కనే ఉన్న వేప, బొప్పాయి, దానిమ్మ చెట్లపైకి ఎగిరిన చిలకల గుంపుని , పిట్టల కిలకిలారావాల్ని వీడియోలో బంధించే ప్రయత్నం చేస్తూ వరుణ్ . ఏదో అద్భుతం చూసినట్లుగా అబ్బురపడుతూ క్రాంతి.
మట్టికొట్టుకుపోయిన కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొచ్చిన నారాయణ దోరగా ఉన్న జామకాయలు కోసి ఇద్దరికీ ఇచ్చాడు.
థాంక్స్ చెప్పి నెమ్మదిగా నారాయణతో మాటల్లో పడ్డారు ఇద్దరూ .
‘ఈ పొలాన్ని చూస్తే నా చిన్నతనం గుర్తొస్తోంది. మాకూ ఇట్లాగే బోరు బావి , రకరకాల కూరగాయలు, పండ్లు, వరి పండేవి. మీరు మీ పంటలతో నాకవన్నీ గుర్తుకుతెచ్చారు ‘ అభినందనగా  క్రాంతి .
‘ఏడేళ్ళ కిందట ఇది రాళ్ళూ రప్పలతో నిండిన దిబ్బ .  కాలమైతే ఇన్ని కందులో జొన్నలో అయ్యేవి. లేకుంటే లేదు. అసొంటి చేన్ల గిట్ల బంగారం పండిత్తనని కలల బీ అనుకోలే.  వేణుబాబు పుణ్యమాని నేనిప్పుడు ఆదర్శ రైతుగా నిలబడ్డ’  కించిత్ గర్వంగా చెప్పుకొచ్చాడు నారాయణ  .
‘నిజమా .. ఆశ్చర్యంగా  ఉందే .. ‘ కళ్ళు పెద్దవి చేసిన వరుణ్
‘అవు సారూ .. కాలువ నీళ్ళు రాని మిట్ట భూములు మావి. మా ఊరు, చేన్లు ఉన్నదే బొగడ మీద. మా ఊరి శివారు అంతా ఇంతే. తరి లేదు. జొన్న , శనగ, కంది వర్షాధార పంటలే.  అవి చేతికి అందొచ్చేవి కావు. అడవి పందులు, అడవి దున్నలు నాశనం చేత్తుండే . అవి తిని తోక్కేసినంక మిగిలినవే ఇంటికోచ్చేది. దాదాపు అందరి పరిస్థితి ఇట్లనే  ఉండే.
“మీదే ఊరు ? ‘
 కొండకు దిగువగా కనిపిస్తున్న ఊరును చూపుతూ ‘అగ్గో .. గదే మా ఊరు .  మిట్టపల్లె . తలకాయ లెక్క ఉన్న గుట్ట కింద మా ఊరు.  మా ఊరి చుట్టు ముట్టుతా ఏరు పారతది.  కానీ మిట్ట మీద ఉన్న మా చేన్లకు చుక్క నీరు ఎక్కదు.  వాననీరు కూడా కిందకే బాటపడుతుండే. బోర్లేసినా పాతాళగంగమ్మ తల్లికి కనికరం లేక పాయె.  ఏమ్జేత్తమని నెత్తి నేలకేసి, లేకుంటే అస్మాన్ కేసి ఆశగ జూస్తుంటిమి.  చినుకు రాల్చక పొతదా అని .

కిందకు బోతే ఆ ఊర్లల్ల నీళ్ళు , పంటలు మంచిగ ఉంటుండే. మాకేమో జరుగుబాటు లేకపాయె.  అప్పులు పెరిగిపాయె.  బతికే మార్గం కానరాకపాయె. బ్యాంకుల్ల ఏడ అప్పు పుట్టకపాయె. కలో గంజో తాగి బతుకుదమని ముసలోల్లను ముతకోల్లను ఇంటికాడొదిలి  జనం పట్నం బాటపట్టె.  అగ్గో గప్పుడచ్చిండు మా ఊర్ల బడికి లస్మయ్య సారు. ఆ సారు అందరు సారుల్లెక్క కాదు. పట్నంల ఉండక పోతుండె . మా ఊల్లెనె చిన్నఇల్లు కిరాయికి తీసుకున్నడు.   ఊర్లె బడికి వచ్చేటి పొల్లగాండ్లు ఎందుకింత తక్కువున్నరో విచారం జేసిండు.  ఒకనాడు  బయటికి పోయి మస్తు చదివి పట్నంల పెద్ద నౌకరీ జేస్తున్న ఆయన కొడుకు వచ్చిండు. పిల్లల గురించి , మా యాతనల గురించి మాటల్ల మాటగా  కొడుకు వేణుబాబుతోని చెప్పిండట ఆ సారు.  ఆ పిల్లగాడి దిమాక్ తిరిగి పోయిందట .  అసలే  మట్టి అంటే పానం పెట్టేటి వేణుబాబు పట్నం నౌకరీ ఎడమకాలితోటి తన్నేసి ఈడనే ఉన్నడు.  ఊర్లనె ఉంటనని చేను కౌలుకు చేసిండు . ఏం ఫాయిదా లేకపాయే.  తండ్రులు  తాతల కెల్లి మేం మడి చెక్కనే నమ్ముకొని బతికేటోల్లం.  పెద్దపెద్దోల్లె మాతోటి అయితలేదని కాడి ఇడిత్తే నువ్వేడ సేద్యం జేస్తవని ఊర్లొల్లు మస్తు జెప్పిన్రు .. పో .. పోయి పట్నంల మంచిగ బతుకుమని అన్నరు. ఇన్నడా .. ఆ బిడ్డడినలే .

వేణుబాబచ్చినంక మాకెరక లేని కొత్త కొత్త ముచ్చట్లు .. ఒకటా రెండా మాస్తు మా ఊర్లకు తెచ్చిండు . ముందుగాల్ల  మేము ఆ బాబు చెప్పింది చెవినబెట్టలే .  మట్టి మీద కొడుకుకున్న ప్రీతి జూసి లస్మయ్య సారు తను జమేసుకున్న పైసలన్నీ తీసి 5 ఎకరాలు కొనిచ్చిండు. బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ లేపిండు. మొదటేడు పంట ఏం రాలే . బోర్లు ఏసిండు. నీళ్ళు పడలే.  250 అడుగులు దించిన ఒంటేలు పోసినట్టు పోసుడు తప్ప ఏం లేదు. పట్నం పోయి ఎవరేవర్నో కలిసేటోడు. పెద్ద పెద్ద సార్లెంటవడి ఆల్లను ఈల్లను మా ఊరికి తెచ్చేటోడు.  వానలు పడేవరకంటే తన చేను చుట్టూత కందకం తవ్విచ్చిండు. అట్ల ఊర్ల ఇంత పని దొరికింది . వానలు పడ్డయి. చుక్క నీరు బయటికి పోలే. అంతా ఆడనే ఇంకి పొయ్యేది . అట్ల ఎడాదేడాది నీళ్ళు పెరిగినయ్. బోర్లు మంచిగ పొస్తున్నయ్.  ఏదో ఒక్కటే పంట ఏసుడు గాదు ..  ఆ భూమిల ఏ పంట ఎత్తే బాగా పండుతదో తెలుసుకొనొచ్చి అవ్వే పంటలు ఏసిండు.  ఎరువులు వాడలే. గడ్డిగాదమేసి ఎర్రలు, నట్టల ఎరువు తయారు చేసి అదే ఏసిండు. పురుగు మందులు కొట్టలే. చేన్లో ఉన్న వేప,తంగేడు, కానుగ ఏవోవో కలిపి ఆకుల కాషాయం చేసి కొట్టిండు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట తీసిండు.  పక్కనే ఉన్న చేను అమ్ముతంటే తల్లి బంగారం అమ్మి చేను కొనుక్కొమ్మని కొడుక్కు ఇచ్చింది. మల్ల 5 ఎకరా కొన్నడు.  రైతులతోని సంగం పెట్టిండు.  మా ఊర్ల ఎన్నడు లేని కొత్త కొత్త పంటలొచ్చినయ్.  పూల తోటలు , పండ్ల తోటలు , పండ్ల మొక్కల నడుమ  కూరగాయల తోటలు చూసి మా దిమాక్ కరాబయింది. అదే ఊరు. అదే నేల. అప్పటికి ఇప్పటికి ఎంత ఫరక్ .. నక్కకు నాగలోకానికున్నంత . చేనుకు ఎంత జేస్త్తే అంత చేపిచ్చుకుంటది. అట్లనే ఇంత బువ్వ పెట్టి సల్లంగ చూస్తదని మాకర్థమయింది.   ఊర్ల  ఒకోక్కళ్ళు వేణుబాబునడిగి కొత్త తీరుగ సాగు షురూ చేసిన్రు.

అగ్గో ..గప్పుడే  ఊర్ల బతుకేలేదని పట్నం బోయిననేను పనిమీద ఊర్లకొచ్చిన. మా ఊర్లనే బంగారం పండిచ్చిన వేణుబాబు సుద్ది ఇన్నంక దిమాక్ తిరిగిపోయింది . పట్నం బతుకు యాష్ట ఎరకైంది గద.  ఆడ గాదు ఈడనే  బతుకని వెనక్కొచ్చి తిండి కోసం కొంచెం వరి , గోధుమ , జొన్న , పెసర , సోయా , గట్లకు కంది, సీజను బట్టి కూరగాయలు, పూలు పండిస్తున్నా. నాలుగు బర్లు పెట్టుకున్న. ఇంటికాడ కోళ్ళు , మ్యాకలు ఉండనే ఉన్నయి. ఈ చేన్లల్ల, ఇంటికాడ  ఇంత జాగ పోనియ్యం . ఏకాలంల పంటలు ఆ కాలంల తీస్తున్నం.  మా ఊర్ల దాదాపు వెయ్యి ఎకరాలల్ల  కందకాలు , చిన్న నీటి కుంటల తోటి నీటి నిల్వలు పెంచుకున్నం.  ఇప్పుడొక్క చుక్క నీరు కిందికి పోదు.  ఒక్క వాన బొట్టు రాలిన అది మా నేలల్నే ఇంకుతది.   తిండికి , బట్టకు, తాగు నీటికి , సాగు నీటికి కొదువలేదు . బంగ్లా కాకున్న  ఉండేతందుకు  చిన్నగా ఇల్లు కట్టుకుంటున్న . పిల్లలను మా ఊరి బడిలోనే చదివిపిస్తున్న. కూలి నాలీ చేసుకొని బతికే నారిగాడు ఇప్పడు  రైతుగా నిలబడ్డడు.’  మోహంలో తళుకు లీనుతున్న విజయగర్వంతో, ఆత్మవిశ్వాసంతో  నారాయణ .

‘ గ్రేట్ .. రియల్లీ గ్రేట్ నారాయణ గారూ ‘ అంటూ షేక్ హాండిచ్చాడు వరుణ్
‘ వండర్ ఫుల్ . చాలా ఆనందంగా ఉంది మీ విజయ గాధ వింటుంటే .. ‘ చప్పట్లు చరిచి విస్మయంగా చూస్తూ క్రాంతి
తనని పోగిడినందుకు కొంచెం బిడియ పడుతూ ‘నా ఒక్కడిదే కాదు మా ఊల్లొ దాదాపు అందరి విజయమే ఇది’ ,
‘అదెలా సాధ్యం ?’
‘అందరం కలసికట్టుగ ఒక్క మాట మీన  ఉంటం.   ఊరు చిన్నదే,  గానీ గప్పుడయితే మూడు పార్టీలు ఆరు గొడవలు .. ఇప్పుడు చేనుకు చేవ రైతుకు రొక్కం అన్నట్టుంది. వేణుబాబు, ఇంకొందరు రైతులయితే గట్ల పొంటి టేకు , మామిడి , జామ, కొబ్బరి నాటిన్రు.  నేను కొన్ని గట్లకు కంది , కొన్ని గట్లకు బెండ , కొన్ని గట్లకు పుంటికూర ఏసిన.  గా ఎనక గట్లకు కొబ్బరి , మామిడి అంట్లు నాటిన .
గాపొద్దు చేతిల చిల్లపెంక లేక ఎంత యాతన పడ్డనో నాకే ఎరుక. ఇప్పుడా బాద లేదు. గాసం తిండిగింజలు , కూరగాయలు , ఆక్కురలు ఏదీ కొనేదే లేదు. పాలు కొనేది లేదు. పండ్లు ఫలాలు కొనేది లేదు. గుడ్లు , మాంసం కొనేది లేదు . గొడ్డు గోదల పెంట చేన్లకు ఎరువు అయ్యే . అంటే ఆ కర్సంత లేనట్టే గద . ఇంట్లకు వాడుకోంగ మిగిలిన పండ్లు పలాలు, పాలుగుడ్లు అమ్మితే చేతిల పైసలు తిరుగుతాన్నయి.
అప్పుడు అడవికి పొయ్యి కట్టెలు తెచ్చి పొయ్యి ముట్టిత్తున్టిమి. సర్కారుతోని మాట్టాడి సబ్సిడీ తోని గోబర్ గ్యాస్ పొయ్యి , ఒక లైటు పెట్టిన్చుకున్నం.  ఊరికి సోలారు కరెంటు పెట్టియ్యాల్నని వేణుబాబు తిరుగుతున్నడు. ఆయన చేన్ల బీ మోటారు సోలారుదే పెట్టిన్చ్చిండు.  మంచిగనే నడుత్తాంది. మేము అదే బాట పట్టాల్నని అనుకున్టాన్నం .
‘ ఏవయ్యో .. తినవా .. ‘ దూరం నుండి పిలుపు
‘అస్త అస్త .. నువ్వు తిను ‘ అంటూ గట్టిగా చెప్పి ‘ మా ఇంటిది ‘ అన్నాడు
‘అవునా అన్నట్టు చూస్తున్న క్రాంతి కేసి తిరిగి ‘మా ఆడోళ్లు ఇంట్ల కూసోరు మేడం. కూలోల్లతోటి నడుమొంచుతరు’
‘మీ పంటని మార్కెట్ ఎలా చేస్తారు ‘ వరుణ్ సందేహం
‘బేరగాళ్ళు మా కాడికే వస్తరు. మార్కెట్ రేటు ఎంతుండచ్చో అందాజ మా ఊరి రేడియోలో వేణుబాబు చెప్తడు. దాన్ని బట్టి ఒకరేటు అనుకొని అట్లనే ఇస్తం. ‘
‘రేడియో నా ..”
‘అవును మేడం , మా ఊర్లొ కమ్యూనిటి రేడియో పెట్టిచ్చిండు వేణుబాబు దోస్తు .   ఆనాటి కెల్లి మా ఊరి పేరు మస్తు దూరంబోయింది.
‘అమేజింగ్ .. ఏమి చెప్తారు మీ రేడియో లో ‘ ఉత్సాహంగా  క్రాంతి ప్రశ్న
‘ఒకటేమిటి  సేద్యానికి, పసులకు , కోళ్ళకు సంబంధించి ముచ్చటించుకునే ముచ్చట్లు ఎన్నో .. అదునుల ఏసేటి పంటలు ,  విత్తనాలు , రోగాలు, రోస్టులు  మందు మాకు, లోన్లు , సబ్సిడీ .. అన్నీ .. మా  రేడియలొస్త్తయ్ . అనుభవాలు చెప్పుకుంటం.  మా  రేడియో ల ముచ్చట్లన్నీ మాయే .. మా గొంతులకెల్లే   .. ‘ ఉద్వేగంతో నారాయణ చెప్పుకుపోతున్నాడు
‘రేడియో ద్వారా మీ గొంతు వినిపించడం చాలా గొప్ప విషయం కదా ..’
‘అవు మేడం .  ముందుగాల్ల బయంతోని పరేషాన్ అవుతుండే .  ఇప్పుడదేం లేదు . మా ఊరి పొల్లలిద్దరు  రేడియో ప్రోగ్రాంల ట్రైనింగ్ బీ  తీసుకున్నరు .  పట్నం సార్లోచ్చి  వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన్రు.
‘ఇవన్నీ చేస్తుంటే మీకు ఇబ్బందులు రాలేదా .. ‘
‘అహ్హహ్హ ..’  నవ్వి ‘రాకుంట ఉంటయా ..సారూ … ఒక్క అడుగు ముందుకువడ్తే నాలుగడ్గులు ఎనక్కి ఇగ్గేటి గుంటనక్కలు మస్తు ఉంటయి గద .. ఊకుంటయా.. ? ఎన్ని జేసిన ఏమయితది మిగతా జనమంత  ఒక్క దిక్కు ఉన్నంక . ఉన్నడు గద వేణుబాబు.  అనుకున్నది అయ్యేదంక .. ఆళ్ళని నిద్దుర పోనియ్యలే . అట్లనే మమ్ముల నిద్దుర పోనియ్యలే .  ‘
‘అవునా చాలా ఆశ్చార్యంగా ఉందే .. ఇప్పుడే వస్తూ దారిలో రైతు ఆత్మహత్య ని చూసొచ్చాం ‘ గంప నెత్తిన పెట్టుకొని అటుకేసి వస్తున్న నారాయణ భార్యని చూస్తూ అడిగింది క్రాంతి .
‘మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఊళ్ళో ఆత్మహత్యలు .. ‘ అనబోతున్న వరుణ్ మాటల్ని అడ్డుకుంటూ  ‘లేవు, సారూ .. లేనే లేవు . ఒకప్పుడు మస్తు ఉంటుండే. ఇగ ఇప్పుడు రావు కూడా ‘ ఆత్మవిశ్వాసంతో చెప్తున్న అతన్ని
‘అంత ఖచ్చితంగా చెప్తున్నారు .. ఎలాగో తెలుసుకోవచ్చా ?’ ఆసక్తిగా వరుణ్

‘మట్టిని నమ్ముకుని బతుకే బతుకులుమాయి. నమ్ముకున్న  భూతల్లి నమ్ముకున్నోడిని అన్యాలం చెయ్యవట్టే .. కాలం కల్సి రాకపాయె .   కుటుంబం పెరిగే.   ఖర్చులు పెరిగిపోయే. భూమి పెరగక పోయే . లేని అలవాట్లు ఇంట్లకోచ్చే . తాగుడు ఎక్కువయ్యే . సోకులు సరదాలు ఎక్కువయ్యే . పోకళ్ళు తగ్గకపాయే . తినేటి తిండిలో పస లేకపోయే . అంత మందుల తిండి . కొత్తకొత్త రోగాలు పుట్టుకొచ్చే .  ఆరుగాలం కష్టం  చేసిన పైస కల్లు సారా దుకాన్లల్లకు , దవాఖాన్లల్లకు జారిపోయే .. . అప్పోసోప్పో చేసి దుబాయ్ పోయి ముల్లె తెస్తారనుకుంటే ముల్లుగర్ర రాకపాయే . చేసిన అప్పు నెత్తి మీద మిగిలి ఆ బరువు పెరిగిపోయె.  సేవసచ్చిన సర్కారు సప్పుడు సేయక పాయె.  ఏమ్జేత్తరు..?  కిస్తీలు కట్టలేక మానేదతో మట్టిలో కల్సిపోవుడు తప్ప ..  నేను ఇట్ల ఉన్ననంటే అంతా వేణుబాబు సలువే .. ‘

‘శ్రీరాంపురంలో  రైతు మల్లయ్య ఎట్లా చనిపోయాడు ‘ జామకాయ తొడిమ విసిరేస్తూ వరుణ్
‘ఏమున్నది  సారూ .. ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నరు . ఆళ్ళు చిన్నగున్నప్పుడే అన్నల దళంల కల్సిండు. పాపం ఆమెనే తల్లీ తండ్రి అయి సాకింది.  పదేండ్ల కిందట దళంలో కెల్లి వెనక్కచ్చిండని సర్కారు కొన్ని పైసలిచ్చింది . నాయిన ఇచ్చిన పదెకరాల మడిచెక్క ఉన్నది . మర్సిన  సేద్యం షురూ జేసిండు. కాలం కాలే.  కాల్వ నీళ్ళు మస్తు పారే పల్లం భూమిల నీళ్ళు లేక బోర్లేసిండు . ఒక్కటి కాదు రెండు కాదు ఆరేడు బోర్లేసిండు ఒక్కటి సరిగ్గ నీళ్ళు పొయ్యక పాయే . పెట్టిన పెట్టుబడి మట్టిలగల్సే . అప్పులే మిగిలే . మంచి సంబందమొచ్చిన్దని అప్పులో అప్పు చేసి అదే టైంల పెద్ద బిడ్డ లగ్గం జేసిండు .  అప్పు మీద అప్పు మిగిలే .. చేను అమ్మేసి అప్పులు తీరుస్తనని ఐదు ఎక్రాలు అయినకాడికి అమ్మిండు. అప్పులు తీరకపాయే . బ్యాంకు లోన్లు రాకపాయే.  సేతిల పెట్టువడి లేకపాయే . మిగిలిన చేన్ల రెండెకరాలమ్ముతనని జూసిండు. కొనేటోళ్లు లేకపాయే .. అప్పులిచ్చినోల్లు నెత్తి మీద కూసునే .. బాగ బతికిన కుటుంబం . ఒకప్పుడు ధాన్యం నిలువలున్న కుటుంబం . నలుగురికీ సాయం చేసిన కుటుంబం .  బెల్లం చుట్టూ ఈగల్లెక్క ఉన్న సుట్టాలు ఇప్పుడు దూరమయ్యె. అంటుకుంటే ఆ దరిద్రం తమకంటుకుంటదేమోనన్న భయంతోని. సేతిల సిల్లపెంక లేకున్న తాగుడు బందుకాలే .  పట్నం పోయిఏదన్న  పని చూసుకుంటనని పోయిండు. వారం పదిదెసాలు కాలే. ఇగో గిట్ల కట్టె వచ్చే’ జీర బోతున్న గొంతుకలో ఏదో అడ్డుపడ్డట్టు ఆగాడు నారాయణ .
‘అతను రైతు కాదు వడ్డీ వ్యాపారి. అందరికీ అప్పులిస్తాడు . ఇచ్చిన అప్పులు రాక ఉరేసుకున్నాడు అని ఈ రోజు పేపర్ లో ఇచ్చారు’ అర్దోక్తితో ఆగాడు వరుణ్
‘అట్లనా సారూ.. సేతిల సిల్లపెంక లేనోడు అప్పులేడ ఇత్తడు సారూ …  ఓ ఎన్నడో  తెల్సినోల్లకి సాయం జేసిండు. అది ఇప్పటి ముచ్చట కాదు, అన్నల్ల కల్వక ముందు ముచ్చట’  .
‘ మేం  వస్తుంటే రాస్తా రోకో చేస్తున్నారు . మేం మా కారు పక్కన పెట్టుకొని విషయం అడిగితే అక్కడి వాళ్ళు చెప్పారు. అతని పరిస్థితి.  మేమూ ఆ రైతు ఇంటిదాకా వెళ్లాం . అక్కడి పరిస్థితి మమ్మల్ని కలచి వేసింది. బతికిన కుటుంబమని , రైతు కుటుంబమని అక్కడి వాతావరణం చెప్తోంది . కరువు బాధలు ఇంత భయంకరంగా ఉంటాయా అని ఆలోచిస్తూ వస్తున్నాం …
‘అవు సారూ .. రైతు బతుకు ఇట్లేన్దుకయితాంది సారూ .. రోజు రోజుకీ పెట్టువడి  పెరిగిపోయే . కంపెనీ మందులు వాడుడుతోని కర్సు పెరిగిపోయే. వచ్చే ఆదాయం తక్కువాయే ‘
‘మరి మీకు వస్తోందిగా ..”
‘మేము సోమ్ముపోసి ఎరువులు కొన్టలేము. కొన్నా ఏదో కొద్దిగా . మా రేడియో చెప్పిన దాన్ని బట్టి కొనటం . అంతే. యాపాకు, యాపకాయ ,కనుగాకు, కనుగగింజలు, ఆవు పెండ , ఆవు మూత్రం,అన్ని మాకు మందులు ఎర్వులు. పోరుగూర్లకు పొతే ఏది అవుసరమో , ఎంత అవుసరమో చూడకుంట కుమ్మరిస్తున్నరు, పురుగుమందులు అంతే .. అన్ని రెట్లు పెరిగినట్టే కూలీ పెరిగే . కర్సు పెరిగిపోదా ..  పెరిగిన కర్సుకు తగ్గట్టు పంట ఉన్నదా .. లేకపాయే.  పంట వచ్చినా దర ఉన్నదా లేకపాయే ..  దళారి కొనుక్కు పోయినంక సర్కారు మద్దతు దర ఇస్తది.  అది అని జేబులకు పోతది .  ఏం జెప్పాలె సారూ .. ‘
‘ఆత్మహత్య చేసుకున్న రైతుకు ప్రభుత్వం ఐదారు లక్షలు ఇస్తుందని అంటున్నారు .. ‘
‘రైతు పానం పోయినంక లక్షలు ఎంతిత్తే ఏం ఫాయిదా సారూ .. పోయిన మనిషి తిరిగొత్తడా .. ? ఆ ఇంటి కస్టాలు తీరతయా.. ఆ రైతు మీదికి సావు రాకుంట సెయ్యాలె ..ఆ  ఇంటిదానికి గోసకాకుంట సేయాలె ‘ అప్పటి వరకూ వింటూ నించున్న  నారాయణ భార్య ఆవేదనగా
‘ఏమో అనుకున్న మంచి ముచ్చటజెప్పినవ్ ‘ అని భార్య వైపు అబినందనగా జూసి ‘అవ్ సారూ .. సేద్యపు కర్సులు తగ్గి పంటలు మంచిగ తీసేటట్టు సెయ్యాలె. వచ్చిన పంటకు తగ్గ రేటు రావలె

“వ్యవసాయ గురూ వేణుబాబులాంటి వారు ఊరికొక్కరు
ఉంటే ..” అంటున్న వరుణ్ మాటల మధ్యలోనే అందుకొని
‘అది సర్కారు బాధ్యత కాదా ..  ‘ కొంచెం ఆవేశంగా క్రాంతి
‘అవ్ రైతు సుత తీరు మార్సుకొవాలె మేడం. పెయ్యి వంపకుంట పై పైన తిరుక్కుంట సేద్యం అంటే ఇట్లనే ఉంటది. నాత్రిపగలు సూడకుంట తన కుటుంబం , తన సేద్యం మీద రైతు మనసుపెట్టాలె . పట్టుదలతోని కష్టపడాలె.  కాలం కాలేదని ఏడ్సుడు కాదు పడ్డ నీటి చుక్క ఒడ్సి పట్టాలే.  సదువు లేని మా అసొంటోళ్ళకు సర్కారే అన్డకావాలే.  అదను పదను ముచ్చట్లు  సేద్యగాని కాడికి తేవాలె .  మా వేణుబాబు ఒక్కడే ఇంత జేస్తున్నడు. ఇప్పుడు మా ఊల్లె కాడి ఎత్తుకునేటోడేగానీ దింపేటోడే లేడు.  సర్కారు కాడ మా లెస్స మంది ఉన్నరు. ఆల్లంత ఇప్పుడు మా ఊరుకోసం అంత ఆల్లే జేసినట్టు మస్తు చెప్పుకోవట్టిరి . అట్లయితే అన్ని పల్లెలు మా ఊరి లెక్క ఉండాలె గద .. ? ఈ సావులన్నీ ఎందుకయితాన్నయ్ ..? ‘ తలగోక్కుంటూ నారాయణ ప్రశ్న
నిజమేనన్నట్లు తలూపారు వరుణ్ , క్రాంతి లిద్దరూ
‘మన సేనుకు , మన కుటింబానికి మనమేమి జెత్తున్నమని రైతు ఇచారం జెయ్యాలె.  పత్తలాడుకుంట, సారా దుకాన్లు , కల్లు దుకాన్ల పొంట తిరుక్కుంట పనుల్లేవని తిట్టుక్కుంట నెత్తిబట్టుకొని కూకుంటే ఎట్ల ..? ఏదోటి జెయ్యాలె .. ఏమ్జేయ్యాల్నో ఇచారం జెయ్యాలె .. ఆడిదాన్ని అంగట్లొదిలి పొతే ఎట్ల ..? గుండెపగిలి ఏడ్సె ఇంటిదాని మొకం కనవడదా .. బిక్కి బిక్కి ఏడ్సె పోల్లగాల్ల మొకం కానరాదా .. ఇంటోడు ఆయింత ఆలోచన చెయ్యకుంట తప్పిచ్చుకు పోతున్నడు ‘ ఆవేదనగా అంది గంపలోని కీరా దోసకాయలు తీస్తూ నారాయణ భార్య .  ఒక్క క్షణమాగి ఆమె

‘ మేమంటే ఈ ఊర్ల ఉండవట్టి ఓ తీరుగఅయినం. మా అన్నదమ్ములు మా తీర్గ సేద్యం చెయ్యనికి సెప్పెటోల్లు ల్యాకపాయే. గాల్లో దీపంబెడ్తే ఆగుతదా .. అప్పులు చుట్టుముట్టి పరేశాన్ల ఉన్నరు.  ఓట్ల పండుగడొచ్చినప్పుడు రైతులకవిజేత్తం ఇవి జేత్తం అని అందరు జెప్పుడే గానీ సేసెటోడు  లేకపాయే .. రైతు మంచిగుంటేనే తినేతందుకు లోకానికి ఇంత ముద్ద దొరుకుతదని సర్కారుకు ల్యాకపాయే .  ఏవియ్యకున్న ఆపదలున్న రైతుకు ఇంత దైర్నం జెప్పెటోడు ల్యాకపాయే .. ఎట్ల ముంగట పడాల్నో నేర్పెటోడు ల్యాకపాయే .. పిట్టల్లెక్క చేన్లల్లనే రాలిపోతున్నరు. రైతు కష్టం లోకానికే అరిష్టం అని తెల్సుకో కొచ్చిరి’ మనసులో అన్నదమ్ముల గురించిన బాధ సుడులు తిరుగుతుండగా  ఆవేదనగా అంది నారాయణ భార్య
‘అవు సారూ ..ఊరుకొక్కల్లు దైర్నం జెప్పెటోడు ఉన్నా ..ముంగటేసేటోడు ఉన్న .. ఇట్లగాకపోను’ సాలోచనగా అన్నాడు నారాయణ
కీరా దోసకాయలు చేతిలో ఉన్న చాకుతో ముక్కలు కోసి క్రాంతి చేతిలో పెట్టింది నారాయణ భార్య .
‘ ఊరికే  వద్దు . మీ తోటలో ఉన్న ఆకుకూరలు ,కూరగాయలు , పండ్లు అమ్మితే కొనుక్కుంటాం’ దోసకాయలు అందుకుంటూ అంది క్రాంతి .
మా దగ్గరకొచ్చిన సుట్టాలు మీరు ఇవి తినండి . ఎన్ని కూరగాయలు కావాల్నో చెప్తే తెమ్పుకొస్త అంది నారాయణ భార్య .
‘మేమూ మీతో పాటు తోటలోకి వచ్చి కూరగాయలు కోయొచ్చా .. ‘ సందేహంగా క్రాంతి
నవ్వుతూ ఆహ్వానించింది ఆమె. ఆ వెనకే వాళ్ళు ఈ రోజు లాంగ్ డ్రైవ్ మిగిల్చిన కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ.. వ్యవసాయ గురూ గురించి ఆలోచిస్తూ.. ముందుకు కదిలారు 

వి. శాంతి ప్రబోధ

నవతెలంగాణ నిర్వహించిన వట్టికోట ఆళ్వారుస్వామి కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి పొందిన కథ . 3.7.2016 సోపతిలో ప్రచురణ

Tag Cloud

%d bloggers like this: