The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘విస్పోటనం’

నిప్పురవ్వల నెగడు

నిరంతర విద్యార్థిగా
శ్రామికుడిగా
కార్మికుడిగా
కర్షకుడిగా
ఎందరికో
ఉచ్చ నీచం ఎరుక జేస్తూ
బతుకు బాట తెలుపుతూ
మును ముందుకు సాగావు
నీలో నీవు
చెకుముకి రాయిలా
నిప్పు రాజేస్తూనే
నిత్యం చైతన్యం రగులుస్తూనే
నిప్పురవ్వల నెగడు వేశావు
ఆ నెగడు మంటల్లో
చలి కాచుకున్న
ఎందరో
నివురుగప్పిన నిప్పులా ఉంటూనే
మళ్లీ నెగడు వేస్తూనే ..
మెరుస్తూనే, జ్వలిస్తూనే
కనువిప్పు కలిగిస్తూనే
నిగ్గుతేలుస్తూనే
అరుణకాంతుల్లో
సంచరిస్తూనే
విస్తరిస్తూనే
విస్పోటనంలా మారుస్తూనే …

వి.శాంతిప్రబోధ

Tag Cloud

%d bloggers like this: