The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ప్రజాస్వామ్యం’

ఓటు

vote

నా ఓటు
నా చేతిలో వజ్రాయుధం
నా ఓటు
కాదు డబ్బుకు దాసోహం
నా ఓటు
లొంగదు మద్యం మత్తుకు, ప్రలోభాలకు,
నా ఓటుకు
లేదు కులం, మతం, ప్రాంతం

నా ఓటు
నాకు అందుబాటులో ఉండే వారికి
నా ఓటు
ప్రచారాలకు కాదు ప్రజా సేవకులకి
నా ఓటు
నీతికి, నిజాయితీకి, అభివృద్దికి
Art-of-Living-Blog-vote-for-a-better-India
నా ఓటు
సముద్రంలో చిన్ని నీటి బొట్టే కావచ్చు ,
నీ ఓటూ ఓ నీటి చుక్కే కావచ్చు , కానీ ..
ఒక్కో చుక్కే మరో చినుకుతో కలుస్తూ
వాగులై వంకలై నదులై
పుడమి తల్లిని సస్యశ్యామలం చేస్తూ ..
నా ఓటూ నీ ఓటుతో జత కలుస్తూ
నాలో , నీలో .. మరొకరిలో చైతన్యం నింపుతూ
ఓట్ల వరదై , బాలెట్ బాక్స్ లు నిండుతూ
ప్రజాస్వామ్యపు పునాదులు గట్టిబరుస్తూ
స్వతంత్ర దేశపు అడుగులు బలపరుస్తూ
నా కోసం నీ కోసం మన కోసం
స్వచ్చమైన పాలన అందించదా ..
మెరుగైన ప్రపంచాన్ని సృస్టించదా…
అన్న ఆశతో .. ఆకాంక్షతో ..
వేలికి సిరా చుక్క వేయించుకుంటా

వి. శాంతిప్రబోధ

Tag Cloud

%d bloggers like this: