The greatest WordPress.com site in all the land!

Archive for the ‘PAATA’ Category

అభివృద్ధి చక్రాలం

బాలలం మేం బాలలం
బంగరు భవితకు పునాదులం
రేపటి సుశిక్షుతులైన పౌరులం
దేశ భవిష్యత్తు నిర్ణేతలం ” బాలలం ”

చిరు చిరునవ్వుల మొలకలం
ముసి ముసినవ్వుల బంధాలం
అల్లరి ఆటల నాట్య మయూరాలం
కోయిల పాటల రాగ సుస్వరాలం ” బాలలం ”

కల్లాకపటం ఎరుగని వాళ్ళం
ఆకాశంలోని విహంగాలం
సూర్యరశ్మిలోని భ్రమరాలం
ఎడారిలోపచ్చదనం నింపే ప్రేమికులం ” బాలలం ”

అణకువ అమాయకత్వం మా సొంతం
ఆత్మీయత అనురాగాలకు బందీలం
అహంకారం అవమానం భరించం
అరుపులు అజమాయిషీ ఆహ్వానించం ” బాలలం ”

వత్తిళ్ళు ఆందోళనలో రాదు మా వికాసం
ఆనందం ఆరోగ్యం కావాలి మా సొంతం
కాదు మేం అమ్మానాన్నల పెట్టుబడి పరిశ్రమలం
కావలి మేం ఆచరణలో దేశ అభివృద్ధి చక్రాలం ” బాలలం ”

వి . శాంతి ప్రబోధ
13.11. 2014

Tag Cloud

%d bloggers like this: