The greatest WordPress.com site in all the land!

నా గురించి నేను …

నా గురించి చెప్పుకోవడానికి ఏముంది?  మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగినదాన్ని.  మానవతా విలువల్ని, సామాజిక బంధాల్ని గౌరవించే నేపథ్యం లోంచి ఎదిగినదాన్ని.  simple living high thinking అని నాన్న చెప్పిన మాటలు ఎప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటాయి.  జర్నలిజం పట్ల ఆసక్తి తో జర్నలిజం చదివాను.  కానీ, డెస్క్ లో తప్ప ఆడపిల్లలకి ఫీల్డ్ లో అవకాశం ఇవ్వమని యాజమాన్యాలు చెప్పడంతో సామాజిక సేవా రంగంలో స్తిరపడ్డా .    డిగ్రీ చదివే రోజుల్లో మదిలే చెలరేగే భావాల్నిఅప్పుడప్పుడూ  పేపర్ పై పరచడం అలవాటయింది.   కందిరీగల రొదలా నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనల తీవ్రతని వదిలించుకోవడానికి పేపర్ పై పెడతా .  అంతే నా పని అయిపొయింది ఆనుకొనే  మహా బద్దకిష్టుని.  ఎప్పుడో బుద్ది పుట్టినప్పుడు వాటిని పెయిర్ చేసి పత్రికలకు పంపేదాన్ని.  ఆ క్రమంలో అడపా దడపా కథలు ,  రేడియో ప్రసంగాలు నిజామాబాదు రేడియో ద్వారా జనంలోకి వచ్చాయి.

నాస్తికోద్యమ నాయకులు, స్వాతంత్ర్యానంతర కాలంలోని సంఘ సంస్కర్తలు అయిన హేమలతా లవణం , లవణం గార్లతో పని చేసే అవకాశం కలగడంతో స్వతహాగా ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి తో  సామాజిక సేవా రంగంలో స్థిర పడ్డా.   వారితో కలసి జోగినీ దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ  తర్వాత గ్రామ  అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని కావడం నాకు ఎంతో నేర్పింది.  నేను పుట్టింది వరంగల్ జిల్లలో అయితే పెరిగింది ఆదిలాబాద్ జిల్లాలో అయినా నేను మెట్టినింటికి నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చే వరకూ “జోగిని ” గురించి  ఎప్పుడూ విననే లేదు.   అలాంటిది అమ్మ-నాన్న (హేమలతాలవణం , లవణం గార్లను అలానే పిలుస్తాం)ల నీడలో సామాజిక కార్యకర్తగా ఎదిగిన నాకు రచనా వ్యాసంగం మా నాన్న రంగారావు నుండే అలవడిందని అనుకుంటున్నా.

నేను బాలలతో బాలల హక్కుల కోసం పనిచేసుకుంటూ వెళ్తున్న క్రమంలోవచ్చిన అనుభవాలతో  వెలువరించిన పుస్తకం “భావవిచికలు “.  ఈ పుస్తకాన్ని ILO, ఆంధ్ర మహిళా సభ . బాల్య లు 2004లో  ప్రచురించాయి.

జోగిని దురాచార నిర్మూలన , పునరావాస కార్యక్రమాల్లో భాగమైన నేను వారి జీవితాల్లోని చీకటిని ప్రపంచానికి తెలియచేయాలి. ఇలాంటి దురాచారాలు రూపుమాపాలన్న ఆలోచనతో రాసిన నవల జోగిని .   “జోగిని ” నవలను వార్త దిన పత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది.  2005 లో ప్రజాశక్తి ‘జోగిని’  పుస్తకాన్ని అచ్చు వేసింది.  2006 సంవత్సరానికిగాను నవలా ప్రక్రియలో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం అందించింది.

ఇదే నవలకు 2009లో  “వెంకట సుబ్బు ” అవార్డు ప్రకటించారు జస్టిస్ అల్లాణి కుప్పుస్వామి  కుటుంబం.  ప్రముఖ రచయిత్రి    కె. రామలక్ష్మి  అభిమానిని అయిన నేను ఆవిడ తో కలసి ఒకే వేదికపై జస్టిస్ కుప్పుస్వామి గారి నుండి అవార్డు అందుకోవడం మరచిపోలేని మధురానుభూతి.

2004లో అమెరికాలోని బోస్టన్ లో జరిగిన global connections youth conference లో భారత దేశ ప్రతినిధిగా స్వప్న అనే బాలికతో కల్సి పాల్గొనడం  samskar – Plan International నాకు ఇచ్చిన గొప్ప  బహుమతిగా భావిస్తాను.   అదే విధంగా 2005 లోసంస్కార్ చైర్మన్  లవణం గారి ఆద్వర్యంలో  స్వీడన్ వెల్లిన  బృందంలో సభ్యురాలిని కావడం, అక్కడి జైళ్ళు, సంక్షేమ కార్యక్రమాల్ని స్టడీ చేయడం గొప్ప అనుభవం.    ఫిన్లాండ్ లో పెక్కా ఎలో, మరి కొందరు హుమనిస్టులతో జరిగిన సభలలో  లవణం తో కలసి పాల్గనడం ప్రపంచాన్ని ఎంతో నేర్పాయి.

2013 జనవరిలో అనుకుంటా అంతర్జాలాన్ని వినియోగించడం మొదలు పెట్టా.

Comments on: "నా గురించి నేను …" (4)

  1. ఎదరో మహానుభావులు వల అందరిలో మీరు ఒకరు అండి

    • మహానుభావులు ఎందరో ఉన్నారు నిజమే . కానీ అందులో నేను ఒకరిని కాదు . అందరిలాంటి దాన్నే నేను కూడా

  2. nice…..and good

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: